నిద్ర పోవడంలేదని పసి పిల్లవాడికి బీరు పట్టించిన మహాతల్లి...మండిపడుతున్న నెటిజన్లు...

ఇండోనేషియాకు చెందిన ఓ తల్లి మాత్రం తన కుమారుడుని నిద్రపుచ్చేందుకు ఏకంగా బీరు తాగించింది. చంటి పిల్లవాడు నిద్రపోవడం లేదని సాకు చెబుతూ ఇలా బీరు తాగించడమే కాదు ఫేస్ బుక్ లో సైతం పోస్ట్ చేసి వివాదం సృష్టించింది.

news18-telugu
Updated: May 18, 2019, 3:45 PM IST
నిద్ర పోవడంలేదని పసి పిల్లవాడికి బీరు పట్టించిన మహాతల్లి...మండిపడుతున్న నెటిజన్లు...
(Image : Facebook/Ineu Ftr)
  • Share this:
చంటి పిల్లాడు నిద్రపోకపోతే ఎవరైనా జోలపాట పాడతారు. లేదంటే కథలు చెబుతారు. అది కుదరకపోతే జోకొట్టి నిద్రబుచ్చుతారు. కానీ ఇండోనేషియాకు చెందిన ఓ తల్లి మాత్రం తన కుమారుడుని నిద్రపుచ్చేందుకు ఏకంగా బీరు తాగించింది. చంటి పిల్లవాడు నిద్రపోవడం లేదని సాకు చెబుతూ ఇలా బీరు తాగించడమే కాదు ఫేస్ బుక్ లో సైతం పోస్ట్ చేసి వివాదం సృష్టించింది. అయితే మహిళ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. నిజానికి పెద్దవాళ్లనే మద్యపానానికి దూరంగా ఉండమని వైద్యులు సలహా ఇస్తుంటారు. అలాంటిది ఏడాది వయస్సున్న చంటి పిల్లవాడికి బీరు పట్టడంపై కేసు నమోదుచేయాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే వైద్యులు మాత్రం పిల్లలకు మత్తు పదార్థాలు చాలా ప్రమాదకరమని, అది వారి జీర్ణ వ్యవస్థపై దుష్పరిణామాలు కలిగేలా చేస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ వైరల్ వీడియోను స్ఫూర్తిగా తీసుకొని ఎవ్వరూ తమ పిల్లలకు బీరు సహా ఇతర మత్తుపానీయాలు తాగించవద్దని హెచ్చరించారు. అలాగే బీరు తాగితే నిద్రపడుతుంది అనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని, ఆల్కాహాల్ కలిపిన బీరు తాగితే మత్తు మాత్రమే వస్తుందని, అది నిద్ర కాదని, మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇండోనేషియాలోనే గత సంవత్సరం ఒక తండ్రి తన పిల్లవాడికి సిగరెట్ దగ్గరుండి తాగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే మహిళను మాత్రం ఇంకా అరెస్టు చేయలేదు. అయితే కేసు విచారణ జరిపేందుకు ఎవరైనా లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.First published: May 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు