342 కిలోల సింహం ఎముకలు స్వాధీనం.. ఎయిర్‌పోర్టులో పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

తంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ మాత్రమే దక్షిణాఫ్రికా నుంచి సింహాల ఎముకలను ఆసియా దేశాలకు తరలించేది. అయితే ఆ తర్వాత కాలంలో సింహాల ఎముకల రవాణాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసుకుంది.

news18-telugu
Updated: October 4, 2019, 3:25 PM IST
342 కిలోల సింహం ఎముకలు స్వాధీనం.. ఎయిర్‌పోర్టులో పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ విమానాశ్రయంలో అధికారులు 342 కిలోల సింహం ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12 బాక్సుల్లో.. అల్యూమినియం ఫాయిల్‌లో సింహం ఎముకలను చుట్టి మలేషియాకు తరలిస్తున్నట్టు గుర్తించారు.వాటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరు జింబాంబ్వేకి చెందిన వ్యక్తి కాగా.. మరో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. పెంపుడు సింహాల ఎముకల తరలింపుకు చట్టబద్దత ఉన్నప్పటికీ.. దానికి కూడా కొన్ని ప్రత్యేక అనుమతులు తప్పనిసరి అని జోహెన్నెస్‌బర్గ్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.కాగా,దక్షిణాఫ్రికాలో 11వేలకు పైగా సింహాలు ఉన్నాయి. ఇందులో 3వేల సింహాలు నేషనల్ పార్క్స్‌లో ఉన్నాయి. గతంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ మాత్రమే దక్షిణాఫ్రికా నుంచి సింహాల ఎముకలను ఆసియా దేశాలకు తరలించేది. అయితే ఆ తర్వాత కాలంలో సింహాల ఎముకల రవాణాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ రద్దు చేసుకుంది. కాగా,సింహం ఎముకలను పలు ఔషధాల తయారీల్లోనూ, బంగారు ఆభరణాల తయారీలోనూ వాడుతారు. దీంతో వాటికి ఉన్న డిమాండ్ రీత్యా.. అక్రమ రవాణా కూడా పెరిగిపోయింది.

First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు