Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: August 21, 2019, 9:38 AM IST
గాల్లో ఎగిరిన మేట్రెసెస్ (Image : YT - No Comment TV)
అమెరికాలోని... కొలరాడో జరిగిందీ ఘటన. ఒక్కసారిగా అక్కడ భీకర గాలులు వచ్చాయి. వాటి దాటికి అక్కడి పార్కులోని మేట్రెసెస్... దొర్లుతూ వెళ్లిపోయాయి. కొన్నైతే ఏకంగా గాల్లో ఎగురుతూ వెళ్లాయి. ఇంతకు ముందెప్పుడూ అంత పెద్ద గాలులు రాలేదు. అందువల్ల ఈ పరిస్థితిని అక్కడి స్థానికులు ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు మాత్రం పెద్ద గాలులు సుడులు తిరుగుతూ వచ్చేసరికి... అల్లకల్లోలం అయిపోయింది. ఇలా బొంతలు ఎగురుతూ వెళ్లడాన్ని రాబ్ మేన్స్ వీడియో షూట్ చేశాడు. వాస్తవానికి డెన్వర్స్ స్టాప్లెటన్ ఎయిర్పోర్ట్ దగ్గరున్న రన్ వే 35 పార్క్ దగ్గర... ది బెడ్ సినిమా కోసం ఈ మేట్రెసెస్ను ఏర్పాటు చేశారు. అవుట్డోర్లో బెడ్లపై పడుకొని సినిమా చూడాలనుకున్న స్థానికులకు రాకాసి గాలులు చుక్కలు చూపించాయి.
దాదాపు వంద దాకా బొంతలు గాల్లోకి ఎగిరిపోయాయి. 2019లో ఇదే అతి పెద్ద మేట్రెసెస్ మైగ్రేషన్ అని కొందరు కామెంట్స్ చేశారు. ఈ పరిణామంతో ఔట్ డోర్ బెడ్ సినిమా కార్యక్రమం రద్దైంది.
Published by:
Krishna Kumar N
First published:
August 21, 2019, 9:38 AM IST