MORE THAN 29 PEOPLE HAVE BEEN DIED AFTER A ROOF COLLAPSED ON A BUILDING IN THE AMAZON CAUSED BY A TORNADO IN THE UNITED STATES PRV
US Tornado: అమెరికాలోని అమెజాన్ సంస్థలో టోర్నడో బీభత్సం.. ఫ్యాక్టరీ కూలడంతో 29 మంది దుర్మరణం.. శిథిలాల కింద 110 మంది
టోర్నడో.
అమెరికాలోని దాదాపు ఏడు రాష్ట్రాల్లో శుక్రవారం అకస్మాత్తుగా తలెత్తిన భారీ టోర్నడోలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల ధాటికి ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. సుడిగాలు లు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీలో పరిస్థితి భీతావహంగా మారింది.
నేల మొత్తాన్ని చాప చుట్టేసినట్లుగా.. వాహనాలు, ఇళ్లు, మనుషులు.. చివరికి విద్యుత్ సంస్థంభాలను సైతం వదలకుండా సర్వనాశనం చేస్తూ భయానక సుడిగాలులు (టోర్నడోలు) అమెరికా (America)లో బీభత్సం సృష్టించాయి. సెంట్రల్, సదరన్ అమెరికాలోని దాదాపు ఏడు రాష్ట్రాల్లో శుక్రవారం అకస్మాత్తుగా తలెత్తిన భారీ టోర్నడోలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల ధాటికి ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. సుడిగాలు లు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీ (Kentucky)లో పరిస్థితి భీతావహంగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన తుపాను అని కెంటకీ గవర్నర్ ఆండీ బెషియర్ (Governor of Kentucky Andy Bessier) శనివారం చెప్పారు. మేఫీల్డ్ నగరంలో అమెజాన్ క్యాండిల్ ఫ్యాక్టరీ (Candle factory) ధ్వంసమయ్యిందని, శిథిలాల కింద 110 మంది చిక్కుకుపోయారని, వారిలో 29 మంది మరణించినట్లు (died) భావిస్తున్నామని తెలిపారు. అయితే రాష్ట్రంలో 70 మందికి పైగా మరణించారని తెలిపారు. మృతుల సంఖ్య 100 దాటవచ్చన్నారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించామన్నారు. 227 మైళ్ల మేర తుపాను ప్రభావం కనిపించిందని గవర్నర్ తెలిపారు. 10 కౌంటీల్లో మరణాలు సంభవించే ప్రమాదం కనిపిస్తోందన్నారు. స్థానిక అధికారులు, నేషనల్ గార్డు సభ్యులు, ఎమర్జెన్సీ వర్కర్స్ మేఫీల్డ్ సిటీలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
ఇల్లినాయిస్ రాష్ట్రం ఎడ్వర్డ్స్విల్లేలోని అమెజాన్ సంస్థ గోదాం (Amazon company warehouse) శుక్రవారం ధ్వంసమయ్యిందని అధికారులు చెప్పారు. పైకప్పుతోపాటు ఒక గోడ కూలిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో తుపాను హెచ్చరిక అమల్లోనే ఉంది. 100 మంది కార్మికులు (Workers) లోపలే చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. క్రిస్మస్ పండగ సందర్భంగా ఆర్డర్లు అధికంగా ఉండడంతో వారంతా రాత్రిపూట కూడా పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కార్మికులను (Workers) క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు చర్యలు చేపట్టారు. ఎవరైనా చనిపోయారా? గాయపడ్డారా? అనేది ఇంకా తెలియరాలేదు. ఎడ్వర్డ్స్విల్లే ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జర్ అన్నారు. రాష్ట్ర పోలీసులు, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ స్థానిక అధికారులతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రమాదంలో చిక్కుకున్న తమ కార్మికులను (Workers) రక్షించుకోవడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అమెజాన్ అధికార ప్రతినిధి రిచర్డ్ రోచా చెప్పారు. ఆర్కాన్సస్ రాష్ట్రంలో తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. మోనెట్టి మానర్ నర్సింగ్ హోమ్ ధ్వంసం కావడంతో ఒకరు మరణించారు. మరో 20 మంది లోపలే ఉండిపోగా వారిని రక్షించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. టెన్నెస్సీ రాష్ట్రంలో తుపాను కారణంగా ముగ్గురు మృతిచెందారు. లేక్ కౌంటీలో ఇద్దరు, ఒబియోన్ కౌంటీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
Some of the worst destruction from the Kentucky tornado was centered in Mayfield, a town of nearly 10,000 people. At least 110 people were huddled inside a candle factory in the area when a tornado ripped through. https://t.co/1VRJZXLBWwpic.twitter.com/Mh3i3oEzZa
తుపాను బీభత్సంపై అధికారులతో కలిసి పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు అవసరమైన సాయం అందిస్తామని బైడెన్ హామీ ఇచ్చారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.