హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Hindus In Pakistan : పాకిస్తాన్ లో ఎంతమంది హిందువులు,క్రిస్టియన్లు ఉన్నారో తెలుసా

Hindus In Pakistan : పాకిస్తాన్ లో ఎంతమంది హిందువులు,క్రిస్టియన్లు ఉన్నారో తెలుసా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hindus In Pakistan : ఈ ఏడాది మార్చి వరకు పాకిస్తాన్ లో మొత్తం జనాభా.. 18 కోట్ల 68లక్షల 90వేల మందికిపైగా( 18,68,90,601) ఉండగా.. వీరిలో 18కోట్ల 25లక్షల 92 వేల మంది( 18,25,92,000) ముస్లింలే ఉన్నారు. మిగిలిన వారు మైనార్టీలు.


Minorities In Pakistan :  1947వరకు ప్రస్తుత పాకిస్తాన్ దేశం భారతదేశంలో అంతర్భాగం అన్న విషయం తెలిసిందే. 1947లో భారత్ నుంచి విడిపోయి ప్రత్యేకదేశంగా ఏర్పడింది పాకిస్తాన్(Pakistan).దేశ విభజన అనంతరం పాకిస్తాన్‌లో హిందువుల జనాభా(Hindu Population) క్రమంగా తగ్గిపోతున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ అంటే ముస్లిం దేశం అని అందరికీ తెలిసిందే. అయితే ఈ దేశంలోనూ ముస్లీమేతర ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అయితే వారి సంఖ్య కొద్దిమొత్తంలోనే ఉంది. తాజాగా నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (NADRA) నివేదిక ఆధారంగా.. ఈ ఏడాది మార్చి వరకు పాకిస్తాన్ లో మొత్తం జనాభా(Pakistan Population).. 18 కోట్ల 68లక్షల 90వేల మందికిపైగా( 18,68,90,601) ఉండగా.. వీరిలో 18కోట్ల 25లక్షల 92 వేల మంది( 18,25,92,000) ముస్లింలే ఉన్నారు. మిగిలిన వారు మైనార్టీలు. అక్కడ నివసిస్తోన్న వారి మతాలు, విశ్వాసాల ఆధారంగా మైనారిటీల సంఖ్యను అంచనా వేశారు.

పాకిస్తాన్ మొత్తం జనాభాలో మైనార్టీలు ఐదు శాతం కంటే తక్కువగా ఉండగా, వారిలో  హిందువుల జనాభా 1.18శాతంగా ఉంది. పాకిస్తాన్ లో నివసిస్తున్న మైనార్టీల్లో హిందువులు అతిపెద్ద మైనార్టీ కమ్యూనిటీగా ఉంది. NADRA నుండి కంప్యూటరైజ్డ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ (CNIC) పొందిన మైనారిటీల ఆధారంగా డేటాను సేకరించిన నివేదిక ప్రకారం.. 1,400 మంది నాస్తికులు సహా వివిధ విశ్వాసాలు, మతాలకు చెందిన 17రకాల మైనార్టీలు పాకిస్థాన్ లో ఉన్నట్లు గుర్తించారు.

చైనా,పాక్ కు దబిడిదిబిడే..రూ.1.5 లక్షల కోట్లతో 114 ఆధునిక యుద్ధ విమానాల కొనుగోలు

ఎన్‌ఐడీఆర్‌ఏ నివేదిక ప్రకారం...పాకిస్తాన్ లో 22లక్షల 10వేల మందికి పైగా(22,10,566) హిందువులు ఉండగా.. 18లక్షలకు పైగా(18,73,348) క్రైస్తవ జనాభా ఉన్నారు. అహ్మదీలు లక్షా 88వేల మంది, సిక్కులు 74వేలు, భయాస్‌ 14వేలతోపాటు మరో 3917 మంది పార్సీలు ఉన్నట్లు ఆ దేశంలో జరిగిన మూడు జాతీయ జనాభా గణనల ఆధారంగా ఈ నివేదిక వెల్లడించింది. ఇక 2వేల కంటే తక్కువ జనాభా కలిగిన మైనారిటీ వర్గాలు పాకిస్తాన్‌లో 11 ఉన్నట్లు తెలిపింది. అయితే, మైనారిటీలుగా ఉన్న వారిలో దాదాపు 95శాతం మంది సింధ్‌ ప్రావిన్సు(సింధ్ రాష్ట్రం)లోనే జీవిస్తున్నారు. బౌద్ధులు 1,787 మంది, చైనీస్ 1,151, షింటోయిజం చెందిన వారు 628, యూదులు 628, ఆఫ్రికన్ మతాల అనుచరులు 1,418, కెలాషా మతం అనుచరులు 1,522, జైనమతం యొక్క ఆరుగురు పాకిస్తాన్ లో ఉన్నారు. మరోవైపు, పాకిస్తాన్‌ చట్టసభల్లో మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యం కూడా లేదనే చెప్పవచ్చు.

See pics : సముద్రంలో బంగారు ఓడ..కుప్పలు కుప్పలుగా బంగారం.. దేశం అప్పులు తీరిపోతాయ్..

ఇక,పాకిస్తాన్ లో మైనార్టీలపై వేదింపులు ఎక్కువే. అహ్మదీస్ నుండి క్రైస్తవులు, హిందువుల వరకు పాకిస్తాన్‌లోని మైనార్టీలు అనేకరకాల వేధింపులను ఎదుర్కొంటున్నారు. రెండు శాతం కంటే తక్కువ హిందువులు వేదింపులు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. అయితే వారిలో 95శాతం మంది దక్షిణ ప్రావిన్స్ సింధ్‌లో నివసిస్తున్నారు. పాకిస్తాన్ యొక్క హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు. అక్కడ వారు ముస్లిం నివాసులతో సంస్కృతి, సంప్రదాయాలు, భాషను పంచుకుంటారు. తీవ్రవాదుల వేధింపులపై అక్కడి హిందువులు తరచూ ఫిర్యాదులు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. హిందూ ఆలయాల ధ్వంసం,హిందువుల ఇళ్లు కూల్చివేత వంటి విషయాలు మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Hindu community leaders, Pakistan

ఉత్తమ కథలు