చనిపోయిన ఆ డాక్టర్ ఇంట్లో.. 2వేల పైచిలుకు గర్భస్త పిండాలు..

క్లోప్‌ఫెర్ 30 ఏళ్లు పలు అబార్షన్ క్లినిక్స్‌లో పనిచేశాడు. 2015లో అతని మెడికల్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.అబార్షన్‌కు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా అతని లైసెన్స్ రద్దయింది.

news18-telugu
Updated: September 15, 2019, 1:28 PM IST
చనిపోయిన ఆ డాక్టర్ ఇంట్లో.. 2వేల పైచిలుకు గర్భస్త పిండాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికాలోని ఇండియానాలో ఉన్న విల్‌కౌంటీలో ఇటీవల మృతి చెందిన క్లోప్‌ఫెర్ అనే ఓ వైద్యుడి ఇంట్లో 2000 పైచిలుకు గర్భస్త పిండాలు లభ్యమయ్యాయి. స్థానిక షెరిఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.సెప్టెంబర్ 3న అతను మృతి చెందగా.. గురువారం కుటుంబ సభ్యులు అతను నివసించిన ఇంటిని సందర్శించారు.ఆ సమయంలో ఇంట్లోనే మెడికల్ పద్దతిలో గర్భస్త పిండాలను సంరక్షిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఇదే విషయాన్ని స్థానిక షెరిఫ్ కార్యాలయానికి చేరవేయగా.. అధికారులు తనిఖీలు నిర్వహించారు.మొత్తం 2000 పైచిలుకు గర్భస్త పిండాలను మెడికల్ పద్దతిలో ఇంట్లోనే సంరక్షించినట్టు ఫెరిఫ్ అధికారులు నిర్దారించారు.అయితే ఇంటి వద్ద ఎలాంటి వైద్య ప్రక్రియలు నిర్వహించిన ఆధారాలు లేవని తేల్చారు.

కాగా, క్లోప్‌ఫెర్ 30 ఏళ్లు పలు అబార్షన్ క్లినిక్స్‌లో పనిచేశాడు. 2015లో అతని మెడికల్ లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.అబార్షన్‌కు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా అతని లైసెన్స్ రద్దయింది. అయితే క్లినిక్ లైసెన్స్ రద్దయిపోవడంతో.. ఇంట్లోనే అతను అబార్షన్స్ నిర్వహించాడా? అని షెరిఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నారు.

First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు