Home /News /international /

MORE POWERFUL TERROR ATTACKS IN SRILANKA BY ISIS AMERICA INTELLIGENCE LATEST WARNINGS NK

శ్రీలంకలో మరిన్ని భయంకర దాడులు... పార్కుల్లోకి సైకిళ్లు తెచ్చి... ఐసిస్ ఉగ్రవాదులు...

శ్రీలంకలో పేలుళ్లు జరిగినచోట చిత్రం

శ్రీలంకలో పేలుళ్లు జరిగినచోట చిత్రం

Srilanka Terror : శ్రీలంకలో మరిన్ని భారీ, శక్తిమంతమైన దాడులకు ఐసిస్ ప్లాన్ వేసిందా... అమెరికా నిఘా వర్గాలు ఏం చెప్పాయి.

శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులకు ఇప్పట్లో చెక్ పడేలా కనిపించట్లేదు. మొత్తం 15 చోట్ల పేలుళ్లకు పాల్పడాలని స్కెచ్ వేసిన ఉగ్రవాదులు... 9 చోట్ల మాత్రమే దాడులు చెయ్యగలిగారు. వందల మందిని చంపినా... మరింత భారీ మారణహోమం సృష్టించాలని, ఈసారి మరింత శక్తిమంతమైన పేలుళ్లు జరపాలని ఐసిస్ ఉగ్రవాదులు స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు శ్రీలంక ప్రభుత్వానికి తాజా హెచ్చరికలు పంపాయి. ప్రధానంగా మొన్నటి దాడుల్లో చర్చిలు, హోటళ్లలోపల హింసకు పాల్పడిన ఉగ్రవాదులు... ఈసారి పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో, రద్దీ ప్రాంతాల్లో సైకిళ్లకు బాంబులు అమర్చి దాడులకు స్కెచ్ వేసినట్లు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి.

మూడు నెలల కిందటే సముద్ర మార్గంలో శ్రీలంకకు వచ్చిన ఉగ్రవాదులు... అప్పటి నుంచీ బాంబు పేలుళ్లకు స్కెచ్ వేశారు. స్థానికంగా ఐసిస్ మద్దతు దారుల్ని కూడగట్టుకొని ఈ పేలుళ్లకు పాల్పడినట్లు అమెరికా తెలిపింది. తిరిగి అదే మద్దతు దారులతో ఈసారి అత్యంత భయంకరమైన పేలుళ్లకు ఐసిస్ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారని అమెరికా నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇప్పుడు ఉన్న దానికంటే రెట్టింపు అలర్ట్ గా ఉండాలని కోరాయి. అందుకు తగ్గట్టుగానే శ్రీలంకలో అణువణువూ సైన్యం పరిశీలిస్తోంది.

ప్రస్తుతం శ్రీలంకలో పడుతున్న భారీ వర్షాలు ఉగ్రవాదులకు కలిసొస్తాయని అనుకుంటున్నారు. వర్షాల వల్ల సైన్యం పూర్తి స్థాయిలో తనిఖీలు చెయ్యలేదు. పైగా సీసీ టీవీలు కూడా మసకబారతాయి. అదే అదనుగా చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నిస్తూ ఉండొచ్చని అమెరికా హెచ్చరించడంతో భయం గుప్పిట్లో ఉంది శ్రీలంక.
First published:

Tags: International, Sri Lanka, Sri Lanka Blasts, World

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు