హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

MonkeyPox : వాయివేగంతో మంకీపాక్స్ వ్యాప్తి.. ఇప్పటికే 12 దేశాలకు వైరస్.. ఆసియా ఖండంలోకీ ఎంట్రీ..

MonkeyPox : వాయివేగంతో మంకీపాక్స్ వ్యాప్తి.. ఇప్పటికే 12 దేశాలకు వైరస్.. ఆసియా ఖండంలోకీ ఎంట్రీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచానికి మరో పీడలా దాపురించింది మంకీపాక్స్ వైరస్. వాయువేగంతో వ్యాపిస్తోన్న వైరస్ ఇప్పటికే 12 దేశాలను కాటేసింది. తాజాగా ఆసియా ఖండంలోకి కూడా ఎంటరైపోయింది. ఇజ్రాయెల్‌ లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఆర్థిక సదస్సు జరుగుతోన్న స్విట్జర్లాండ్ లోనూ కేసు బయటపడింది..

ఇంకా చదవండి ...

కరోనా నుంచి ఇటీవలే కోలుకుంటోన్న ప్రపంచానికి మరో పీడలా దాపురించింది మంకీపాక్స్ వైరస్ (Monkeypox virus). వాయువేగంతో వ్యాపిస్తోన్న వైరస్ ఇప్పటికే 12 దేశాలను కాటేసింది. తాజాగా ఆసియా ఖండంలోకి కూడా ఎంటరైపోయింది. ఇజ్రాయెల్‌ లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిని పరీక్షించగా మంకీపాక్స్‌గా తేలినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. అతనిని ప్రస్తుతం టెల్ అవీవ్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోన్న స్విట్జర్లాండ్ లోనూ తాజాగా తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది.

ఇతర దేశాల నుంచి వచ్చిన వారు జ్వరం, శరీరంపై గాయాలతో బాధపడితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలు సూచించాయి. ఇజ్రాయెల్ లో మరిన్ని అనుమానిత మంకీపాక్స్‌ కేసులను డాక్టర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. స్విట్జర్లాండ్‌లో తొలి కేసు నమోదు కాగా.. ఆ బాధితుడికి కాంటాక్ట్ అయిన వారందరినీ ఆ దేశ ఆరోగ్య శాఖ పరీక్షిస్తుంది.

CM KCR ఇలా చేస్తే లీటరు పెట్రోల్ రూ.80కే -ఢిల్లీ, లండన్ పర్యటనల రహస్యమిదే: Bandi Sanjay


ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 80కిపైగా మంకీపాక్స్ కేసులను గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 50 అనుమానిత కేసులున్నాయి. గతంలో ఈ కేసులు పశ్చిమ ఆఫ్రికాతో సంబంధాలున్న వ్యక్తుల్లో మాత్రమే కనిపించాయి. కానీ ఇప్పుడు అమెరికా, బ్రిటన్, స్పెయిన్, పోర్చగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియాల్లో కూడా ఈ కేసులు గుర్తించారు.

Vali 2.0 : కవల సోదరుడు.. తమ్ముడి భార్యను ఏమార్చి నెలలపాటు.. విషయం తెలిశాకే అసలు ట్విస్ట్..


* లక్షణాలు ఇలా: ఈ వైరస్ సోకిన వ్యక్తిలో జ్వరం, శరీరంపై దద్దుర్లు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి 2 నుంచి 4 వారాల పాటు ఉంటాయి. మంకీపాక్స్‌లో ప్రధానంగా రెండు జాతులు(స్ట్రెయిన్స్‌) ఉన్నాయి. ఒకటి కాంగో స్ట్రెయిన్. ఇది కొంత తీవ్రంగా ఉంటుంది. ఈ స్ట్రెయిన్ సోకితే దాదాపు 10 శాతం వరకు మరణాలు సంభవించే అవకాశం ఉంది. మరో స్ట్రెయిన్‌ పశ్చిమ ఆఫ్రికా.. దీని మరణాల రేటు కేవలం 1 శాతం కంటే ఎక్కువ. ప్రస్తుతం UK లో నమోదు అవుతున్న కేసుల్లో పశ్చిమ ఆఫ్రికా స్ట్రెయిన్‌ ఉన్నట్లు గుర్తించారు.

Tamil Nadu : రాత్రి నిద్రిస్తుండగా.. భార్య అనుకొని మరొకరిని.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారు!


* మంకీపాక్స్ పూర్వపరాలు: ఈ వైరస్ మశూచి లాంటిదే. దీన్ని మొదటి‌సారిగా 1958లో ప్రయోగశాలలోని కోతుల్లో కనుగొనడంతో మంకీపాక్స్ అని పేరు పెట్టారు. మనుషుల్లో ఈ వైరస్ 1970లో గుర్తించారు. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతాలకే పరిమితమైన ఈ వైరస్, చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఇటీల బ్రిటన్‌లో నమోదైన తొలి కేసు మూలాలు ఆఫ్రికాలోని నైజీరియాలో ఉన్నాయి. అయితే తాజాగా యూరప్‌లో నమోదు అవుతున్న కేసులకు ఆఫ్రికాతో ఎటువంటి సంబంధం లేకపోవడంతో ఇది ఎలా వ్యాపిస్తుందన్న దానిపై శాస్ర్తవేత్తలకు అంతు చిక్కడం లేదు.

Petrol Diesel Prices Today: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. వచ్చే వారం మళ్లీ రేట్ల తగ్గింపు!


* ఇలా సోకుతుంది: వైరస్ సోకిన జంతువు కరిచినా ఈ వ్యాధి సోకుతుంది. అలాగే మనుషుల నుంచి మనుషులకు ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి రక్తం, చెమటను తాకినా ఇది సోకుతుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన జంతువు మాంసం సరిగా ఉడికించ‌కుండా తిన్నా ఈ వ్యాధి ప్రబలుతుంది. ఉడతలు, ఎలుకల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది.

MonkeyPox Virus: మాయదారి మంకీపాక్స్.. వేగంగా విస్తరిస్తోన్న వైరస్.. లక్షణాలు, వ్యాప్తి ఇలా..


శృంగారం ద్వారా వ్యాప్తి: ప్రస్తుతం ఈ వైరస్ ఎక్కువగా యువకులకు సోకుతోంది. ఆఫ్రికాతో సంబంధం లేని ఓ యువకుడికి ఈ వైరస్ సోకింది. అతను స్వలింగ సంపర్కుడు అని, ఈ నేపథ్యంలో ఇది లైంగికంగా ఒకరి నుంచి మరొకరి సోకుతుందన్న అనుమానాలను యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వ్యక్తం చేసింది. ఆ యువకుడు ఇటీవల మరో పురుషుడితో శృంగారం చేశాడని వెల్లడించింది. స్పెయిన్, పోర్చుగల్‌లో కూడా యువకుల్లోనే ఈ వ్యాధి సోకింది. వారు కూడా ఇతర మగాళ్లతో సెక్స్‌లో పాల్గొన్నారని ఆ దేశాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో శృంగారం ద్వారా ఈ వ్యాధి సోకుతుందన్న అనుమానాలకు ఇది బలం చేకూర్చినట్లయింది. మరోపక్క స్వలింగ సంపర్కం వర్గాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

First published:

Tags: Israel, Monkeypox, Switzerland, Virus

ఉత్తమ కథలు