• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • MONKEYPOX UNITED KINGDOM REPORTS TWO NEW CASES OF RARE DISEASE MONKEYPOX WHAT IS THIS HOW IT SPREAD KNOW FULL DETAILS OF IT NK

Monkeypox: మరో కొత్త వ్యాధి... మంకీపాక్స్... ఇది ఏంటి? లక్షణాలు ఏంటి?

మరో కొత్త వ్యాధి... మంకీపాక్స్... పూర్తి వివరాలు

Monkeypox: కరోనా వచ్చాక మనం రకరకాల వ్యాధుల పేర్లు వింటున్నాం. మొన్నటిదాకా బ్లాక్ ఫంగస్‌ల టెన్షన్ నడిచింది. ఇప్పుడు కొత్తగా మంకీపాక్స్ అనేది వచ్చింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఏం చెప్పిందో తెలుసుకుందాం.

  • Share this:
    Monkeypox: ఈ ప్రపంచంలో వ్యాధులు కామన్. మన చుట్టూ ఉండే గాలిలో లక్షల కొద్దీ వైరస్‌లు, బ్యాక్టీరియా ఉంటాయి. కాబట్టి... రకరకాల వ్యాధులు సోకడం సహజమే. కాకపోతే... వాటి గురించి ముందే తెలుసుకుంటే... మనకు సోకకుండా జాగ్రత్త పడవచ్చు. ఆల్రెడీ కరోనాతో సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉన్నాం. తాజాగా యూరప్‌లోని ఐర్లాండ్ ఉత్తరాన... మంకీపాక్స్ (monkeypox) కేసులు రెండు వెలుగులోకి వచ్చాయని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పింది. దీనిపై కాస్త పరిశీలనగా చూశాక ఓ విషయం తెలిసింది. మంకీపాక్స్ సోకిన ఇద్దరు వ్యక్తులూ ఒకే కుటుంబానికి చెందిన వారు. వారికి ఈ వ్యాధి సోకి 21 రోజులు అయ్యింది. ఈ 21 రోజుల్లో వారు ఎవరెవర్ని కలిశారు అనేది తెలుసుకున్నారు. యూకే (27 దేశాల కూటమి)ని దాటి ఎవరూ బయటకు వెళ్లలేదని తేలింది. ప్రస్తుతం ఆ ఇద్దర్నీ ఇంగ్లండ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు.

    మంకీపాక్స్ అంటే:
    మంకీపాక్స్ అనేది... స్మాల్‌పాక్స్ (smallpox) వైరస్ తాలూకాకు చెందినది. స్మాల్‌పాక్స్‌ని మనం మశూచి లేదా పెద్ద అమ్మవారు సోకింది అంటాం. ఈ మంకీపాక్స్ అనేది సహజంగా మధ్య ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికాలోని అడవుల్లో ఉండే ప్రజలకు సోకుతూ ఉంటుంది. కరోనా లాగే... మంకీపాక్స్ కూడా... ఇతరులకు ఈజీగా సోకగలదు. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా.. తుంపర్ల ద్వారా... ఇతరులకు ఇది సోకుతుంది. ఇది సోకిన వారికి ఇది 6 నుంచి 13 రోజుల్లో తగ్గుతుంది. కొంత మందికి 5 నుంచి 21 రోజులు కూడా ఉంటుంది.



    మంకీపాక్స్ లక్షణాలు (symptoms):
    ఈ వ్యాధి వెంటనే బయటపడదు. ఇది సోకిన 14 నుంచి 21 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు స్వల్పంగా లేదా తీవ్రంగా ఉండగలవు. చర్మంపై కురుపులు వస్తాయి. అవి బాగా దురద పెడతాయి. నొప్పి కూడా ఉంటుంది. స్వల్ప లక్షణాలు ఉంటే... ఉన్నట్లు గుర్తించలేరు. ఫలితంగా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా సోకేస్తుంది. ఇప్పటివరకూ యూకే చరిత్రలో తాజా 2 కేసులతో కలిపి మొత్తం 6 కేసులు మాత్రమే కనిపించాయి.

    ఇది కూడా చదవండి: Human magnetism: వామ్మో... మనుషులకు అయస్కాంత శక్తి... ఎందుకిలా?... ఏం జరుగుతోంది?

    వ్యాక్సిన్ ఉందా లేదా?
    ఉంది. 2019లో మంకీపాక్స్ వ్యాక్సిన్‌కి ఆమోదం వచ్చింది. ఐతే... వీటిని ఎక్కువగా తయారుచెయ్యలేదు. ఎందుకంటే... ఈ వ్యాధి పెద్దగా అమల్లో లేదు.





    అయినా దీనిపై మనం ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యంగా, కాస్త ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధక శక్తి) ఉన్నవారికి ఇది సోకదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. అందువల్ల కరోనాతో పోల్చితే... ఇది పెద్ద మ్యాటరే కాదు. కాకపోతే... ఏదో వచ్చింది కాబట్టి... జస్ట్ ఐడియా కోసం తెలుసుకుంటే మంచిదే.
    Published by:Krishna Kumar N
    First published: