MONKEYPOX MASSACHUSETTES IDENTIFIES FIRST US CASE OF MONKEYPOX IN 2022 HERE IS ITS SYMPTOMS SK
Monkeypox: మంకీపాక్స్... మరో వైరస్ వచ్చేసింది.. అమెరికాలో కలకలం.. ఇది డేంజరా?
ప్రతీకాత్మక చిత్రం
Monkeypox: మంకీపాక్స్ అమెరికాకు మళ్లీ వచ్చేసింది. మసాచుసెట్స్‌లో తొలి కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. మరి ఈ వ్యాధి లక్షణాలేంటి?
కరోనా మహమ్మారి (Coronavirus) ఇంకా మనల్ని వదలివెళ్లలేదు. 2020 యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసింది. ఆ కరోనా సృష్టించిన విధ్వంసాన్ని ఇంకా మర్చిపోకముందే మరిన్ని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. తాజాగా అమెరికాను కొత్త వ్యాధి వణికిస్తోంది. అదే మంకీపాక్స్ (Monkeypox Virus). అరుదైన మంకీపాక్స్ వైరస్ అగ్రరాజ్యం అమెరికా (America)ని వణికిస్తోంది. 2022లో తొలి కేసు నమోదవడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. మసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మంకీపాక్స్ బాధితుడు ఇటీవలే కెనడా (Canada)కు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. కెనడాకు వెళ్లొచ్చిన తర్వాత అతడికి వ్యాధి సోకిందని.. సామాజిక వ్యాప్తి ద్వారానే వచ్చి ఉండవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుప్రతిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆరోగ్యం
నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
మంకీపాక్స్ వ్యాప్తి (Monkeypox Transmission) చెందకుండా అధికారులు చర్యలు చేపట్టారు.ప్రస్తుతానికి ఒక్క కేసు మాత్రమే వెలుగులోకి వచ్చిందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఐనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల పలు యూరప్ దేశాల్లో కూడా మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. యూకే, స్పెయిన్, పోర్చుగల్, స్పెయిన్ వంటి దేశాల్లో వైరస్ బాధితులు ఉన్నారు. అమెరికాలో గతేడాది కూడా కొంతమంది దీని బారినపడ్డారు. నైజీరియాలో పర్యటించిన వచ్చిన ఇద్దరు వ్యక్తులకు మంకీపాక్స్ సోకింది. ఇక తాజాగా ఈ సంవత్సరంలో మొదటి కేసు మసాచుసెట్స్‌లో బయటపడింది.
అసలేంటిది?
మంకీపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినదే. అంటే మనదేశంలో తట్టు, అమ్మవారిలానే ఇది కూడా కనిపిస్తుంది. ఈ వైరస్‌ను మొదట 1958లో మొదటిసారి కోతుల్లో గుర్తించారు. అందువల్ల దీనికి మంకీ పాక్స్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మనుషులకు సోకింది. 1970ల్లో తొలిసారి మనుషుల్లో గుర్తించారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. అందులోనూ ఎక్కువగా ఎలుకలు, చంచులు, ఉడతల నుంచి వ్యాపిస్తుంది. ఈ మంకీపాక్స్ వ్యాధి సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకుతుంది. గాలి తుంపర్ల ద్వారా, వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బైసెక్సువల్, లేదా పురుషులు-పురుషులు సెక్స్ చేసుకోవడం వల్ల కూడా మంకీ వ్యాధి వ్యాప్తి చెందుతోని కొందరు చెబుతున్నారు. ఐతే ఈ విషయంపై అధ్యయనం జరగాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మంకీపాక్స్ వ్యాధి ఎవరికైనా సోకిన తర్వాత.. శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సుమారు 6 నుంచి 13 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి 21 రోజులు సమయం తీసుకుంటుంది.
లక్షణాలు (Monkeypox Symptoms):
మంకీపాక్స్ సోకిన వారిలో స్మాల్‌పాక్స్ మాదిరిగానే..ముఖం, కాళ్లుచేతులపై బొబ్బలు, దద్దుర్లు కనిపిస్తాయి. ఒక్కోసారి శరీరమంతా వ్యాపిస్తాయి. జ్వరం, తలనొప్పి, నడుము నొప్పి, కండరాల నొప్పి, వాపు, అలసట ఉంటుంది. కొందరిలో ఇలాంటి లక్షణాలేవీ కనిపించవు. ఈ వ్యాధి బారినపడిన వారిలో చాలా మంది వారాల వ్యవధిలోనే కోలుకుంటారు. తక్కువ మందికి మాత్రమే ప్రాణాపాయంగా ఉంటుంది. ప్రతి 10 మందిలో ఒకరికి మంకీపాక్స్ ప్రాణాంతంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటిచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.