Lopburi Monkey Buffet Festival : కొన్నిసార్లు నమ్మకాలు మతానికి సంబంధించినవి మరియు కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల ఉంటాయి, కానీ వాటిని సంవత్సరాలుగా జరుపుకోవడం వల్ల అవి ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. .థాయిలాండ్(Thailand) లోని మంకీ బఫెట్ ఫెస్టివల్(Monkey Buffet Festival) అటువంటి నమ్మకానికి చెందిందే. థాయిలాండ్ లో ప్రతి ఏటా "మంకీ బఫెట్ ఫెస్టివల్" నిర్వహిస్తారని మీకు తెలుసా. అవును థాయిలాండ్ లోని బ్యాంకాక్ కు 150 కిలోమీటర్ల దూరంలోని లోప్ బురి(Lopburi) అనే నగరంలో ప్రతి ఏటా నవంబర్ చివరి ఆదివారం రోజున లో కోతుల పండుగ నిర్వహిస్తారు. పండుగలో భాగంగా కోతులకు వివాహాల వంటి బఫే నిర్వహిస్తారు. ఊరేగింపులా తయారుచేయడం, బఫేలో భోజన ఏర్పాట్లు, అలంకరణ చేయడం.. ఇదంతా మనుషులకు కాదు కోతులకే కావడమే ఈ పండుగ ప్రత్యేకత.
పండుగ నిర్వాహకులు కోతుల(Monkeys) కోసం తాజా పండ్లు, సలాడ్లు,థాయ్ స్వీట్లను అందజేస్తారు. ఈ పండుగను చాలా పెద్ద ఊరేగింపుగా జరుపుకుంటారు. స్థానిక వ్యాపారవేత్త ఈ పండుగను ప్రారంభించినట్లు ప్రజల నమ్మకం. లోపురిలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, అందుకే పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వచ్చి వాటికి ఆహారం అందజేస్తారని అతను భావించాడు. అతడు ఈ పండుగ ప్రారంభించిన వెంటనే పర్యాటకుల సంఖ్య పెరిగి వ్యాపారుల వ్యాపారం కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో కోతులు ఎక్కువగా ఉండేలా కోతులకు పార్టీలు ఇవ్వడం ప్రారంభించాడు.
American Woman Pregnant: ఈమె 16 ఏళ్లు వరుసగా గర్భవతి,12మంది పిల్లలకు తల్లి,అయినా ఇంకా
కరోనా వైరస్(Covid virus),లాక్ డౌన్(Lockdown) సమయంలో థాయ్‌లాండ్‌లోని ఈ నగరం కూడా కోతుల కారణంగా ఇబ్బంది ఎదుర్కొంది. కోవిడ్ కు ముందు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వచ్చేవారు, వారు కోతులకు ఆహారం, పానీయాలు ఇచ్చేవారు., కానీ కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు రావడం మానేశారు, ఇప్పుడు అది చాలా వరకు తగ్గింది. కోతులు ఇప్పుడు ప్రజల కార్లలోకి చొరబడుతున్నాయి, దుకాణాల నుండి వస్తువులను దొంగిలిస్తున్నాయి, ఆహారం కోసం పోరాడుతున్నాయి. ఇందులో భాగంగా తరచుగా ప్రజల ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తున్నాయి. చాలా కాలంగా ఇక్కడి కోతులు మనుషులతో కలిసి జీవిస్తుంటాయి కాబట్టి ఇప్పుడు మనుషులకు భయం కూడా అంతరించిపోయింది. 2020 సంవత్సరంలో, చాలా కోతులను క్రిమిరహితం చేశారు, తద్వారా వాటి జనాభాను నియంత్రించవచ్చు, కానీ ఇది జరగలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.