• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • MONGOOSE ACTS AS IT IS DEAD AS HORNBILL MIGHT CATCH IT UP FUNNY VIRAL VIDEO ON SOCIAL MEDIA NK

Viral video: చచ్చినట్లు నటించిన ముంగీస... ఆస్కార్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

Viral video: చచ్చినట్లు నటించిన ముంగీస... ఆస్కార్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

Viral video: చచ్చినట్లు నటించిన ముంగీస... (image credit - instagram)

Viral video: జంతువులు తెలివైనవి అని అప్పుడప్పుడూ నిరూపిస్తూ ఉంటాయి. ఈ వీడియోలో ముంగీస కూడా తన తెలివితేటల్ని ఫన్నీగా చూపించింది.

  • Share this:
    Viral video: చిన్నప్పుడు ఎలుగుబంటి కథ మీకు గుర్తుండే ఉంటుంది. ఇద్దరు స్నేహితులు అడవిలో వెళ్తుండగా... దూరంగా ఓ ఎలుగుబంటి తమవైపే రావడం చూస్తారు. ఇద్దరిలో ఒకడు పారిపోయి ఓ చెట్టు ఎక్కుతాడు. మరొకడికి చెట్టు ఎక్కడం రాదు... అందువల్ల అతను ఉన్న చోటే పడుకొని చనిపోయినట్లుగా నటిస్తాడు. అతని దగ్గరకు వచ్చిన ఎలుగుబంటి.. చనిపోయాడు అనుకొని వెళ్లిపోతుంది. సరిగ్గా ఈ కథలో రెండో అబ్బాయి చేసినట్లే చేసింది ఓ ముంగీస. శవంలా పడి ఉంటే... తన ప్రాణాలకు ప్రమాదం ఉండదు అని అది ఆలోచించడం ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం.

    ఇందులో రెండు ముంగీసలు ఆడుకుంటుంటే... హార్న్ బిల్ పక్షి వాటికి సమీపంలోకి వస్తుంది. దాంతో ఓ ముంగీస పక్షి దగ్గరకు వెళ్లి... ఆ పక్షి చూస్తున్నప్పుడు శవంలా పడి ఉంటోంది. పక్షి వేరేవైపు చూస్తున్నప్పుడు పైకి లేచి... పక్షి ఏం చేస్తోందా అని చూస్తోంది. అలా మూడుసార్లు శవంలా పడి నటించింది. ఇలా ఆ ముంగీస... పక్షి నుంచి హాని రాకుండా జాగ్రత్త పడటం నెటిజన్లకు బాగా నచ్చుతోంది. ఇన్‌స్టాగ్రామ్ లోని ఈ వీడియోను చాలా మంది చూస్తున్నారు. ఆ వీడియో మీరూ చూడండి.








    View this post on Instagram






    A post shared by wildlife 0.2 (@wildlife_0.2)





    ఆశ్చర్యకరం ఏంటంటే... అసలు ముంగీస అలా ఎలా ఆలోచించగలుగుతోంది అన్నది. మనం మనుషులం కాబట్టి మనకు తెలివితేటలు ఉంటాయి. కానీ మూగ జీవాలకు కూడా తెలివితేటలు ఉంటాయని చాలా జంతువులు నిరూపించినట్లే ఇక్కడ ముంగీస కూడా నిరూపించింది.

    ఇది కూడా చదవండి: Land of unmarried beauties: ఆ టౌన్‌ అంతా పెళ్లి కాని బ్యూటీలే... ఎందుకంటే

    మొత్తానికి ఓ మంచి వీడియో మనం చూసినట్లైంది. ఇలాంటివి మరిన్ని తెలుగు న్యూస్18లో చూస్తూనే ఉందాం.
    Published by:Krishna Kumar N
    First published: