భారత ప్రధానిగా నరేంద్ర మోదీ(Narendra Modi) బాధ్యతలు చేపట్టి 8 ఏళ్లు దాటినా ఆయన ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గకపోగా అంతకంతకు పెరుగుతుంది. జాతీయ స్థాయిలో ఆయనకు ఎంత ఫాలోయింగ్ ఉందో అంతర్జాతీయంగా కూడా ఆయన చరిష్మా కొంచెం కూడా తగ్గడం లేదు. మన దేశంలోనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో మోదీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే అనేక సర్వేలు దీనిని రుజువు చేశాయి కూడా. ఇక తాజాగా మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో నరేంద్ర మోడీయే మళ్లీ నెంబర్ వన్ గా నిలిచారు.
ప్రపంచ అత్యుత్తమ నేతలపై సర్వేను నిర్వహించగా 77 శాతం ఓటింగ్‌తో వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్ గా మరోసారి ప్రధాని మోదీ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని అంథోని అల్బనీస్ 56 శాతంతో రెండో స్థానంలో, అమెరికా అధ్యక్షుడు బిడెన్ 41 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఆ తరువాత కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 38 శాతం, బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ 36 శాతం, జపాన్ ప్రధాని పూమియో కీషీడా 23 శాతంతో తరువాతి స్థానాల్లో నిలిచారు.
Yet again PM Shri @narendramodi tops the global podium. Approval ratings of PM Modi are the highest among all major world leaders. pic.twitter.com/Y97GCXRmFB
— BJP (@BJP4India) November 24, 2022
2022 ఆగష్టులోను టాప్ లో..
కాగా ఈ ఏడాది ఆగష్టులోనూ "మార్నింగ్ కన్సల్ట్(Morning Consult)"ప్రపంచ అత్యుత్తమ నేతలపై సర్వేను నిర్వహించగా 75 శాతం ఓటింగ్‌తో ప్రధాని మోదీ టాప్ ప్లేస్‌లో నిలిచారు. 63 శాతం ఆమోదంతో రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ ఉండగా, 54 శాతంతో మూడో స్థానంలో ఇటలీ ప్రధానమంత్రి మారియో ద్రాగి నిలిచారు. అయితే ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం 41 శాతం అప్రూవల్ రేటింగ్‌తో 5వ స్థానంతో సరిపెట్టుకున్నారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో 39 శాతం, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద 38 శాతంతో బైడెన్ తర్వాత స్థానంలో ఉన్నారు.
తాజాగా మరోసారి టాప్ లో మోదీ..
మార్నింగ్ కన్సల్ట్... పలు దేశాలను పాలించే నేతలకున్న ప్రజామోదాన్ని ట్రాక్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఈ రాజకీయపరమైన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తుంది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ వంటి దేశాల్లో ఈ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సంస్థ నిర్వహించిన మే, ఆగష్టు సర్వేల్లో కూడా మోదీనే మొదటిస్థానంలో నిలిచారు. ఇక ఈసారి కూడా మోదీ గతం కంటే మరో 2 శాతం ఫాలోయింగ్ పెంచుకొని అగ్రస్థానంలో నిలిచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Joe Biden, Modi, Narendra modi, Pm modi, PM Narendra Modi