ప్రపంచ నాయకుడు మోదీ.. ఐదో స్థానంలో డోనాల్డ్ ట్రంప్..

ప్రధాని నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)

‘మార్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన పోల్ ప్రకారం.. దేశాధినేతల్లో 82 శాతం ఓటింగ్‌తో మోదీ టాప్‌లో ఉన్నారు.

  • Share this:
    ప్రధాని నరేంద్ర మోదీ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. పాలన తీరు, కరోనాపై పోరు.. ఇతర అంశాల్లో తనకు ఎదురు లేదని నిరూపించుకుంటున్నారు. ప్రపంచ రాజకీయ నాయకులను సైతం వెనక్కి నెట్టి నంబర్ వన్ ప్లేసులో కొనసాగుతున్నారు. ‘మార్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన పోల్ ప్రకారం.. దేశాధినేతల్లో 82 శాతం ఓటింగ్‌తో మోదీ టాప్‌లో ఉన్నారు. లాక్‌డౌన్ కంటే ముందు కూడా టాప్‌లోనే ఉండగా, అప్పుడు 74 శాతం మంది భారతీయులు మోదీకే ఓటేశారు. తాజాగా.. మే 19న నిర్వహించిన పోల్‌లో 8 శాతం ఓట్లు పెంచుకొన్నారు. మోదీ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్(66 శాతం), జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్(56 శాతం), బోరిస్ జాన్సన్ (55 శాతం) ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం కేవలం 1 శాతం అదనపు ఓట్లు (మొత్తంగా 43 శాతం) దక్కించుకొని ఐదో స్థానంలో ఉన్నారు.
    టాప్‌లో మోదీ (Photo : stastica.com)
    Published by:Shravan Kumar Bommakanti
    First published: