Pakistan: దేవాలయంపై అల్లరి మూక దాడి.. విగ్రహాలు ధ్వంసం.. వీడియో వైరల్

ప్రతీకాత్మక చిత్రం

దేవాలయంపై దాడి ఘటనను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. రహీమ్‌యార్‌ఖాన్ జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

  • Share this:
    పాకిస్తాన్‌లో అల్లరి మూక రెచ్చిపోయింది. దేవాలయంపై దాడి చేసి దేవుడి విగ్రహలను ధ్వంసం చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని రహీమ్‌యార్‌ఖాన్ జిల్లా భోంగ్ ఈ ఘటన జరిగింది. పదుల సంఖ్యలో అల్లరి మూకలు ఆలయంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. రాళ్లు, కర్రలతో విగ్రహాలను ధ్వంసం చేశారు. దేవాలయం ప్రధాన ద్వారానికి నిప్పుపెట్టారు. పట్ట పగలే ఈ ఘటన జరిగింది. అంతేకాదు ఆలయంపై దాడి దృశ్యాలను ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టారంటే ఎంతకు తెగించారో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఘటనపై ఇప్పుడు పాకిస్తాన్ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    దేవాలయంపై దాడి ఘటనను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. రహీమ్‌యార్‌ఖాన్ జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలో మైనార్టీలకు రాజ్యాంగం అన్ని హక్కులను కల్పించిందని.. వారు తమ ప్రార్థనా మందిరాల్లో పూజలు చేసుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఐతే ఆలయంపై దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించలేదని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నారు. వారు సకాలంలో స్పందించి నిందితులకు చర్యలు తీసుకొని ఉంటే.. ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదని విమర్శలు గుప్పిస్తున్నారు.

    ఇది కూడా చదవండి:

    డబ్బుల్లేవ్.. ప్రధాని ఇల్లు అద్దెకిస్తున్న పాకిస్తాన్.. రెంట్ ఎంతంటే...

    బూతు వీడియోలను తెగచూస్తున్న వివాహితలు.. మగాళ్లను మించి..!

    Expensive Fiber: బంగారం ధర కంటే అధికంగా ఉంటుంది ఆ పక్షి ఈక..దీని
    Published by:Shiva Kumar Addula
    First published: