Home /News /international /

MISSILES FIRED FROM IRAN HIT US CONSULATE SITE IN IRAQ PVN

U.S Consulate : అమెరికా కాన్సులేట్ పై 12 మిసైల్స్ తో దాడి

ఇరాక్​ లోని అమెరికా కాన్సులేట్ ​పై మిసైల్స్ దాడి

ఇరాక్​ లోని అమెరికా కాన్సులేట్ ​పై మిసైల్స్ దాడి

U.S.Consulate in Iraq : అమెరికా రాయబార కార్యాల‌యంపై ఆదివారం తెల్లవారుజామున సుమారు 12 క్షిప‌ణుల‌తో దాడి జరిగింది. ఈ క్షిపణుల దాడుల్లో ఎవరైనా మరణించారా అనే విషయం కూడా ఇంకా తెలియదని చెప్పారు. అయితే, కాన్సులేట్​ వద్ద పలు నిర్మాణాలు ధ్వంసమైనట్లు చెప్పారు.

ఇంకా చదవండి ...
U.S.Consulate Site in Iraq : ఇరాక్ లోని ఇర్బిల్లోని అమెరికా రాయబార కార్యాల‌యంపై ఆదివారం తెల్లవారుజామున సుమారు 12 క్షిప‌ణుల‌తో దాడి జరిగింది. దౌత్య కార్యాలయం భవనానికి పలు రాకెట్లు ఢీకొట్టటం వల్ల స్వల్పంగా ధ్వంసమైందని, అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్​, అమెరికా భద్రతా అధికారులు తెలిపారు. ఇర్బిల్లోని సలాహ్ అల్ దిన్ ప్రాంతంలో ఆ కార్యాల‌యం ఉంటుంద‌ని, దాని ప‌క్క‌నే కుర్దిస్థాన్ 24 టీవీ స్టేషన్ ఉంటుంద‌ని ఇరాక్ అధికారులు తెలిపారు. పేలుళ్ల వ‌ల్ల ఆ టీవీ ఛానల్, కాన్సులేట్ భవనం కిటికీలు, ఇతర సామగ్రి మాత్రమే ధ్వంసమయ్యాయని వివ‌రించారు. అక్క‌డే ఉండే ఇర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఎలాంటి ప్రభావం ప‌డలేద‌ని, ఒక్క విమానం కూడా రద్దు కాలేదని తెలిపారు. ఈ క్షిపణుల దాడుల్లో ఎవరైనా మరణించారా అనే విషయం కూడా ఇంకా తెలియదని చెప్పారు. అయితే, కాన్సులేట్​ వద్ద పలు నిర్మాణాలు ధ్వంసమైనట్లు చెప్పారు.

ఈ క్షిపణులను పొరుగుదేశం ఇరాన్​ నుంచి ప్రయోగించినట్లు అమెరికా సీనియర్​ భద్రతా అధికారి ఒకరు తెలిపారు . అమెరికా జవాన్లలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. సిరియాలోని డమాస్కస్ సమీపంలో ఇజ్రాయెల్ దాడులలో ఇరాన్ కు చెందిన రివల్యూషనరీ గార్డ్‌లోని ఇద్దరు సభ్యులను చంపిన కొద్ది రోజుల త‌ర్వాత ఈ దాడి జరిగింది. సిరియా, డమస్కస్​ లో దాడి చేసి.. ఇరాన్​ రెవల్యూషనరీ గార్డ్​కు చెందిన ఇద్దరు సభ్యులను ఇజ్రాయెల్​ హతమార్చింది. డమస్కస్​ దాడిని ఈనెల 9న ఇరాన్​ విదేశాంగ మంత్రిత్వ ఖండించింది ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది. ఈ దాడి జరిగిన కొన్ని రోజుల్లోనే మిసైల్స్​ ప్రయోగం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘ‌ట‌న‌పై అధికారులు విచార‌ణ ప్రారంభించి, వివ‌రాలు తెలుసుకుంటున్నారు.

ALSO READ Russia Ukraine war: మోదీ సర్కార్ సంచలనం -ఉక్రెయిన్ కీవ్‌లోని భారత ఎంబసీ తరలింపు..

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. క్షిపణులు నేరుగా అమెరికా రాయబార కార్యాలయ భవనాన్ని తాకలేదని తెలిసింది. అయితే రాయబార కార్యాలయం పరిసరాల్లో మాత్రం మిస్సైల్స్​ వల్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఇరాక్ ప్రభుత్వం మరియు కుర్దిష్ ప్రాంతీయ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నాయని యూఎస్ అధికారి తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Iran, Iraq, Missile, USA

తదుపరి వార్తలు