Miss Universe 2022 : మిస్ యూనివర్శ్ 2022 కిరీటాన్ని అమెరికాకు చెందిన బోనీ గ్యాబ్రియెల్ (R'Bonney Gabriel) దక్కించుకుది. అమెరికా.. లూసియానాలోని... న్యూ ఒర్లియాన్స్‌లో.. న్యూ ఒర్లియాన్స్ మోరియల్ కన్వెన్షన్‌లో.. 71వ మిస్ యూనివర్శ్ పేజెంట్‌లో బోనీ గ్యాబ్రియెల్ విజేతగా నిలిచింది. ఇండియాకి చెందిన 2021 విశ్వ సుందరి హర్నాజ్ సంధు.. ఆమెకు కిరీటాన్ని బహుకరించింది.
ఈ పోటీల్లో వివిధ దేశాల నుంచి 84 మంది సుందరాంగులు పోటీ పడ్డారు. వెనిజులా బ్యూటీ ఆండ్రియా మార్టినెజ్ (Andreina Martinez) ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా... మిస్ డొమినికన్ రిపబ్లిక్ బ్యూటీ ఆండ్రెల్నా మార్టిల్నెజ్ ఫౌనియర్ రొసాడో (Andreína Martínez Founier-Rosado) సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.
View this post on Instagram
బోనీ గ్యాబ్రియెల్ చాలా టాలెంటెడ్. ఆమె ఓ ఫ్యాషన్ డిజైనర్, మోడల్, కుట్లు ఎలా కుట్టాలో చెప్పే ఇన్‌స్ట్రక్టర్. హైస్కూల్ చదివే రోజుల్లోనే ఫ్యాబ్రిక్, టెక్స్‌టైల్స్, డిజైనింగ్‌పై ఆసక్తి చూపింది. నార్త్ టెక్సాస్ యూనివర్శిటీ నుంచి ఫ్యాషన్ డిజైన్‌లో 2018 సంవత్సరంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది.
View this post on Instagram
ప్రస్తుతం ఆమె ఆర్ బొన్నీ నోలా క్లాథింగ్ లైన్‌కి సీఈఓగా వ్యవహరిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Miss universe news