హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Miss Univerese: మిస్ యూనివర్స్ రన్నరప్ ఇండియా బొమ్మ తయారుచేసిన శ్రీలంక ఆర్టిస్ట్

Miss Univerese: మిస్ యూనివర్స్ రన్నరప్ ఇండియా బొమ్మ తయారుచేసిన శ్రీలంక ఆర్టిస్ట్

మిస్ యూనివర్స్ రన్నరప్ ఇండియా బొమ్మ తయారుచేసిన శ్రీలంక ఆర్టిస్ట్ (Credit: IG/niggydolls)

మిస్ యూనివర్స్ రన్నరప్ ఇండియా బొమ్మ తయారుచేసిన శ్రీలంక ఆర్టిస్ట్ (Credit: IG/niggydolls)

Miss Univerese: మిస్ యూనివర్స్ కాలేకపోయినా... రన్నరప్‌గా నిలిచిన... అడెలిన్ కాస్టెలినో అందర్నీ ఆకర్షించింది. ఫలితంగా ఈ శ్రీలంక ఆర్టిస్టు... ఏకంగా ఆమె బొమ్మనే తయారుచేశాడు.

Miss Univerese 2020-21: మిస్ యూనివర్స్ 2020-21 పోటీలు మే 16న ఫ్లోరిడాలో జరిగాయి. ఈసారి మెక్సికో బ్యూటీ ఆండ్రియా మెజా కిరీటాన్ని దక్కించుకుంది. అయితే... మిస్ ఇండియా 24 ఏళ్ల అడెలిన్ కాస్టెలినో... ఈ పోటీల్లో టాప్ 4లో నిలిచింది. ఫలితంగా మూడో రన్నరప్ అయ్యింది. 74 మంది అమ్మాయిలతో పోటీ పడి... టాప్ 4లో నిలవడం ఈజీ కాదు. ఆమె టాలెంట్ గుర్తించిన శ్రీలంక ఆర్టిస్ట్... అచ్చం ఆమె లాంటి బొమ్మను తయారుచేశాడు. ఆ బ్యూటీ పేజెంట్‌లో కాస్టెలినో... వేసుకున్న శారీ కాస్టూమ్‌ ఆధారంగా ఈ బొమ్మను తయారుచేశాడు. ఆ పోటీల్లో కాస్టెలినో పింక్ శారీ ధరించింది. ఇండియాలో కమలం పువ్వును ఆమె ఆదర్శంగా తీసుకుంది. పింక్ కలర్ కమలం పువ్వును గుర్తు చేస్తూ... ఆ కాస్ట్యూమ్ వేసుకుంది.

అదే పింక్ కలర్ కాస్ట్యూమ్‌తో బొమ్మను తయారుచేసి... ఇన్‌స్టాగ్రామ్‌లోని నైగీడాల్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు ఆర్టిస్ట్. కాస్టెలినోకి శుభాకాంక్షలు తెలిపిన ఆర్టిస్ట్... శ్రీలంక నుంచి అభిమానిస్తున్నట్లు తెలిపాడు. "ఈ కాస్ట్యూమ్ భారతీయ మహిళను గుర్తుచేస్తోంది. ఈ శారీ సంప్రదాయకమైనది. ఇది మొత్తం దేశాన్ని ఐక్యం చేస్తుంది. దీని రంగు... జాతీయ పుష్పాన్ని గుర్తుచేస్తోంది" అని తెలిపాడు.

View this post on Instagram


A post shared by NIGYDOLLS (@nigydolls)ఈ పోస్టును అడెలిన్ కాస్టెలినో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీ-షేర్ చేసింది. తన బొమ్మను చేసినందుకు థాంక్స్ చెప్పింది.

View this post on Instagram


A post shared by NIGYDOLLS (@nigydolls)ఈ పింక్ సిల్క్ శారీని... డిజైనర్ శ్రావణ్ కుమార్ రూపొందించారు. దీనిపై నెమలి పించంలు ఉన్నట్లుగా డిజైన్ చేశారు. ఈ శారీతోపాటూ ఆమె క్యూరియో కాటేజ్ సంస్థ రూపొందించిన నగలను ధరించింది.


ఈ శారీని ఐదు నెలల పాటూ చాలా మంది నేత పనివారు కలిసి రూపొందించారు. వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను అని శ్రావణ్ కుమార్ తెలిపారు.


ఇది కూడా చదవండి: Diabetes Control: డయాబెటిస్‌ సమస్యకి వేప ఆకులతో చెక్... ఇలా చెయ్యండి

ఇండియా నుంచి ఒకప్పుడు బ్యూటీ క్వీన్స్ అయిన సెలీనాజైట్లీ, లారా దత్తా, రోచెల్లె రావ్ సెక్వీరా వంటి వారు... వారి పేజెంట్ రోజులను గుర్తుచేసుకుంటూ... అడెలైన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అడెలిన్ కాస్టెలినో... 2020 మిస్ దివా యూనివర్స్ గెలుచుకుంది. అడెలిన్ పుట్టింది కువైట్‌లో కానీ... 15 ఏళ్ల వయసు నుంచి ఇండియాలోని ముంబైలో ఉంటోంది. ఆమె పేరెంట్స్... కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. అడెలిన్ ఇంగ్లీష్, హిందీతోపాటూ కొంకణి భాష మాట్లాడగలదు.

First published:

Tags: Viral, VIRAL NEWS

ఉత్తమ కథలు