కిరీటం పెట్టుకునే క్షణంలో కొప్పు కాలిపోయింది...

మిస్ ఆఫ్రికా పోటీలకు వెళ్లిన ఆమెకు తృటిలో ప్రమాదం తప్పింది.

news18-telugu
Updated: January 2, 2019, 4:30 PM IST
కిరీటం పెట్టుకునే క్షణంలో కొప్పు కాలిపోయింది...
మిస్ కాంగో దోర్కాస్ కసిందా
  • Share this:
ఆమె ఎన్నాళ్లగానో ఎదురుచూసిన సమయం వచ్చింది. అండ్ ద విన్నర్ ఈజ్... అంటూ కౌంట్ డౌన్ జరిగింది. మిస్ ఆఫ్రికా అంటూ ఆమె పేరు వినిపించింది. అంతే ఆమె కళ్లల్లో ఆనందబాష్పాలు. మిస్ ఆఫ్రికా కిరీటం పెట్టుకోవడానికి మరికొంత సమయం ఉంది. అంతలోనే ఆమె జుట్టు మీద మంటలు. దీంతో ఆమె షాక్‌కి గురైంది. వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆమె జుట్టు మీద మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. అసలు మిస్ ఆఫ్రికా పోటీల్లో ఆమె జుట్టు మీదకు మంటలు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. విజేతను ప్రకటించిన తర్వాత సెలబ్రేషన్స్‌లో భాగంగా క్రాకర్స్ కాల్చడం అలవాటు. దీంతో నిర్వాహకులు టపాసులు కాల్చారు. దీంతో ఆ మంటలు చెలరేగి ఆమె జుట్టు మీద పడ్డాయి. కొద్దిసేపట్లోనే ఆ మంటలను ఆర్పేశారు. అనంతరం మిస్ కాంగోగా ఎన్నికైన ఆమెకు కిరీటాన్ని ధరింపజేశారు.



మిస్ కాంగో దోర్కాస్ కాసిందాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. పెద్ద ప్రమాదం లేకపోవడంతో ఆమె, నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. తనకు సపోర్టుగా నిలిచిన అందరికీ హ్యాపీ న్యూయర్ గ్రీటింగ్స్ చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.

Published by: Ashok Kumar Bonepalli
First published: January 2, 2019, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading