హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఆ దేశంలోని రోడ్లపై వాహనం స్పీడు 120 తగ్గొద్దు.. లేదంటే జరిమానా.. ఎంతంటే..

ఆ దేశంలోని రోడ్లపై వాహనం స్పీడు 120 తగ్గొద్దు.. లేదంటే జరిమానా.. ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fine For Less Speed: చట్టం అమల్లోకి రాగానే హెచ్చరిక సందేశాలు కూడా జారీ చేస్తారు. ఈ విషయంలో డ్రైవర్లు కచ్చితంగా నిబంధనలను పాటించాలని అబుదాబి పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్ డైరెక్టర్ మేజర్ జనరల్ అహ్మద్ సైఫ్ బిన్ జైటూన్ అల్ ముహైరీ తెలిపారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రేపటి నుంచి మన దగ్గర అనేక రూల్స్ మారుతున్నాయి. అందులో చాలా ఉన్నాయి. మన దేశంలో మారినట్టుగానే.. ఇతర దేశాల్లోనూ రేపటి నుంచి కొన్ని రూల్స్ మారుతున్నాయి. అందులో పెద్ద విశేషం ఏమీ లేకపోయినా.. అబుదాబిలోని రేపటి నుంచి అమల్లోకి రాబోయే కొత్త రూల్ గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవును, వినడానికి ఇది వింతగా ఉన్నా.. ఇది నిజంగా నిజం. అబుదాబిలోని షేక్ మహ్మద్ బిన్ రషీద్ రోడ్‌లో కనీస వేగ పరిమితిని ఏప్రిల్ 1 నుండి గంటకు 120 కిమీగా నిర్ణయించనున్నట్లు అబుదాబి పోలీసులు గురువారం ప్రకటించారు. అబుదాబిలోని షేక్ మహ్మద్ బిన్ రషీద్ రోడ్డులో 120 కి.మీ కంటే తక్కువ డ్రైవ్ చేస్తే రూ.9,000 జరిమానా విధిస్తారు.

ఏప్రిల్ 1 నుంచి ఈ రహదారిపై కనీస వేగ పరిమితిని 120 కి.మీలుగా నిర్ణయించనున్నట్లు అబుదాబి పోలీసులు గురువారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి కనీస వేగ పరిమితి కంటే తక్కువ వాహనాలు నడిపే వారికి జరిమానా విధించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ రోడ్డులో గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. కనీస వేగం 120 కి.మీ.

ఈ తక్కువ వేగం పరిమితి రోడ్డుపై ఎడమ నుండి మొదటి మరియు రెండవ లేన్‌లలో ఉంది. దీని కంటే తక్కువ వేగంతో వెళ్లే వాహనాలు రోడ్డుపై మూడో లేన్‌కు వెళ్లాలి. కనీస వేగ పరిమితి లేదు. భారీ వాహనాలు రోడ్డు చివరి లేన్‌లో వెళ్లాలని, అలాంటి వాహనాలకు కనీస వేగ పరిమితి వర్తించదని అబుదాబి పోలీసులు తెలియజేశారు.

Costliest Mango: ఈ మామిడి పండ్లు కిలో 2 లక్షల రూపాయలు.. అసలేంటి దీని ప్రత్యేకత ?

Shobha Yatra : మత సామరస్యం అంటే ఇదే.. శోభాయాత్రలో పాల్గొన్న ముస్లింలు

చట్టం అమల్లోకి రాగానే హెచ్చరిక సందేశాలు కూడా జారీ చేస్తారు. ఈ విషయంలో డ్రైవర్లు కచ్చితంగా నిబంధనలను పాటించాలని అబుదాబి పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్ డైరెక్టర్ మేజర్ జనరల్ అహ్మద్ సైఫ్ బిన్ జైటూన్ అల్ ముహైరీ తెలిపారు. రహదారి భద్రతను నిర్ధారించడంలో భాగంగా కనీస వేగం కూడా నిర్ణయించబడింది.

First published:

Tags: Drivers, Trending

ఉత్తమ కథలు