హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

పేగుల్లో కాన్సర్‌ను కనిపెట్టే మినీ రోబో... లండన్ సైంటిస్టుల సృష్టి...

పేగుల్లో కాన్సర్‌ను కనిపెట్టే మినీ రోబో... లండన్ సైంటిస్టుల సృష్టి...

సోనోపిల్ (Image : Twitter / الموجات فوق الصوتية الألتراساوند والدوبلر)

సోనోపిల్ (Image : Twitter / الموجات فوق الصوتية الألتراساوند والدوبلر)

Sonopill : వాళ్లూ, వీళ్లూ అని తేడాలేకుండా... ఈ రోజుల్లో చాలా మందిని వెంటాడుతున్న వ్యాధి... కాన్సర్. ఈ వ్యాధిపై పోరాటంలో భాగంగా... సైంటిస్టులు... మినీ రోబోను తయారుచేశారు.

కాన్సర్‌లో ఏడు రకాలున్నాయి. వాటిలో ఒకటి కొలన్ కాన్సర్ (పెద్ద పేగులో కాన్సర్). అలాంటి కాన్సర్‌ను కనిపెట్టేందుకు సాధారణంగా ఎండోస్కోపిక్ చేస్తారు. ఇది ఎంతో నొప్పితో కూడిన విధానం. దానికి బదులుగా లండన్ సైంటిస్టులు... మందు బిళ్ల సైజులో ఓ రోబోను తయారుచేశారు. ఈ రోబో కాప్స్యూల్... పొట్టలోకి వెళ్లి... పేగుల్లో తిరుగుతూ... అక్కడి ఫొటోలు తీసి... డాక్టర్లకు పంపుతుంది. సోనోపిల్ అని పిలిచే ఈ రోబో పంపేవి మైక్రో-అల్ట్రాసౌండ్ ఫొటోలు. ఈ ఫొటోల ద్వారా కాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది. కాన్సర్ ఉంటే అది ఏ స్టేజ్‌లో ఉంది, అక్కడి కణాల పరిస్థితి ఏంటి? కణాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి వంటి అంశాలు తెలుసుకోవడానికి వీలవుతుంది.

ఇంటెలిజెంట్ మాగ్నెటిక్ మానిప్యులేషన్ అనే టెక్నిక్ ఉపయోగించి... పదేళ్లుగా రకరకాల ప్రయోగాలు చేసి... చివరకు ఈ సోనోపిల్‌ను తయారుచేశారు శాస్త్రవేత్తలు. 3.9 సెంటీమీటర్ల పొడవుండే ఇందులో మాగ్నెటిక్ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలగలిసి... హై క్వాలిటీ ఫొటోలను ఇవ్వనున్నాయి. పనైపోయిన తర్వాత ఈ రోబో తిరిగి బయటకు వచ్చేస్తుంది.

ప్రస్తుతానికి ప్రయోగ దశలో ఉన్న ఈ రోబో... త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అన్ని కాన్సర్ హాస్పిటల్స్‌లో అందుబాటులోకి తెస్తామంటున్నారు. కాన్సర్‌తోపాటూ... ఎన్నో ప్రమాదకర వ్యాధుల్ని కనిపెట్టేందుకు ఈ రోబో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

పొట్టలో వచ్చే వ్యాధులతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల మంది చనిపోతున్నారు. వాళ్లలో చాలా మందికి కొలన్ కాన్సర్, బొవెల్ కాన్సర్ వంటివి సోకుతున్నాయి.


ఇవి కూడా చదవండి :

వరి పంటను కాపాడే రోబో... జపాన్ ఇంజినీర్ల సృష్టి

4 రోజుల తర్వాత శుభకార్యాలు లేవ్... 3 నెలల వరకూ అంతే...

ఎకనమిక్ పాలసీపై ప్రధాని మోదీ దృష్టి - ఆర్థికవేత్తల సలహాలు స్వీకరణ

First published:

Tags: Cancer, International, World

ఉత్తమ కథలు