నా గర్ల్‌ఫ్రెండ్‌ని పడెయ్యండి... రూ.11 లక్షలు గెలుచుకోండి... మిలియనీర్ వింత ఆఫర్...

లండన్‌కి చెందిన ఆ మిలియనీర్ ఇచ్చిన యాడ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తను పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిని ప్రేమలో పడెయ్యమని ఎందుకు ఆఫర్ ఇస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అతను చెప్పిన కారణం తెలిశాక... ముక్కున వేలేసుకుంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 1:51 PM IST
నా గర్ల్‌ఫ్రెండ్‌ని పడెయ్యండి... రూ.11 లక్షలు గెలుచుకోండి... మిలియనీర్ వింత ఆఫర్...
ప్రతీకాత్మక చిత్రం (Image : Instagram)
Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 1:51 PM IST
"అప్పుల్లో ఉన్నారా... ఈజీగా డబ్బు కావాలా... సింపుల్... నా ఫియాన్సీ (పెళ్లి చేసుకోబోయే యువతి)ని లవ్‌లో పడెయ్యండి. రూ.11 లక్షలు గెలుచుకోండి"... ఇదీ లండన్‌లోని లగ్జరీ మార్కెట్ ప్లేస్ హుష్‌హుష్‌లో కనిపించిన యాడ్. ఈ యాడ్ చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. "ఈడెవడ్రా... వాడి గర్ల్‌ఫ్రెండ్‌ని పడేస్తే... డబ్బులిస్తానంటున్నాడు" అని షాకవుతున్నారు. ఈ డీల్ కుదుర్చుకునేవాళ్లకు కొన్ని కండీషన్లు పెట్టాడు. దరఖాస్తు దారులు చూడటానికి అందంగా ఉండాలట. నిజంగానే తన గర్ల్‌ఫ్రెండ్‌ని ప్రేమిస్తున్నట్లు నటించాలట. ఆమెకు జుట్టంటే ఇష్టం కాబట్టి... దరఖాస్తుదారుడికి తలపై బాగా జుట్టు ఉండాలట. అతడు మంచి లైఫ్‌స్టైల్ మెయింటేన్ చేస్తూ ఉండాలన్నాడు. బాడీ షేప్ కూడా మేన్లీగా ఉండాలని కండీషన్లు పెట్టాడు.

"వేరే ఎవడో అమ్మాయిని పడేస్తే... ఇక ఫియాన్సీని అతను మర్చిపోవాల్సిందే కదా"... అన్న ప్రశ్న ఆ యాడ్ చూసిన వాళ్లకు కలుగుతోంది. ఇందుకు కారణం కూడా చెప్పాడు ఆ కోటీశ్వరుడు. ఆమెతో పెళ్లికైతే సిద్ధమయ్యాడు కానీ... తనను ఇష్టపూర్వకంగా చేసుకోవాలనుకుంటోందా లేక తన డబ్బును చూసి చేసుకోవాలనుకుంటోందా అన్నది తేలుకోవాలనుకుంటున్నాడట.

డీల్ కుదుర్చుకున్న వ్యక్తిని తన కంటే డబ్బున్న వాడిలా నటించమని చెబుతాడట. డబ్బు కోసమే పెళ్లికి సిద్ధమయ్యే అమ్మాయి అయితే... ఆ నటించే వ్యక్తితోనే పెళ్లికి సిద్ధమవుతుందనీ... అలా కాకుండా నిజంగా ప్రేమించే అమ్మాయి అయితే... తననే పెళ్లి చేసుకుంటుందన్నది ఆ మిలియనీర్ ఆలోచన.

ఆఫర్ అదిరింది అంటున్న చాలా మంది కుర్రాళ్లు... మిమ్మల్ని (కాబోయే కపుల్స్) విడగొట్టడం మాకు ఇష్టం లేదని అంటున్నారు. ఆమె మనసులో ఆలోచనను తెలుసుకునేందుకు ఇతర పద్ధతులేవైనా ఫాలో అవ్వమని సూచిస్తున్నారు కొందరు.

First published: August 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...