తల లేకుండా 18 నెలలు బతికిన కోడి... ఎలా సాధ్యమైందంటే...

Mike the Headless Chicken : శరీరంలో ఏ పార్ట్ పనిచెయ్యాలన్నా... తల కీలకం. అది లేకుండా ఏ జీవైనా బతకలేదు. అలాంటిది ఓ కోడి మాత్రం 18 నెలలు తల లేకుండా బతికింది అదెలా సాధ్యమైందంటే...

Krishna Kumar N | news18-telugu
Updated: May 13, 2020, 12:56 PM IST
తల లేకుండా 18 నెలలు బతికిన కోడి... ఎలా సాధ్యమైందంటే...
తలలేని కోడి (Image : Wikipedia)
  • Share this:
దాని పేరు మైక్. అందరూ దాన్ని అద్భుతమైన మైక్ అని పిలిచేవారు. 1945 ఏప్రిల్ 20న పుట్టింది. ఐదున్నర నెలల తర్వాత... సెప్టెంబర్ 10, 1945న కొలరాడోలోని లాయిడ్ ఓల్సెన్... చికెన్ వండుకుందామని ఆ కోడిని తెచ్చాడు. ఐదున్నర నెలల ఆ కోడి మెడపై గొడ్డలితో ఒక్కటిచ్చాడు. దెబ్బకు తల కట్ అయ్యింది. ఐతే పూర్తిగా కట్ అవలేదు. ముఖ్యంగా తల నుంచీ శరీరానికి మెదడు సిగ్నల్స్ పంపించే జుగ్లర్ వెయిన్ ( జుగ్లర్ నరం) కట్ అవ్వలేదు. ఓ చెవి, చాలావరకూ మెదడు కూడా కోడి మెడతోపాటే ఉండిపోయింది. ఆ టైంలో స్లిప్ అయిన కోడి పరుగులు పెట్టింది. దాన్ని పట్టుకోవడంలో లాయిడ్ ఓల్సె్న్ ఫెయిల్ అయ్యాడు. పైగా కోడి మెడ నుంచీ వచ్చిన బాధాకరమైన అరుపులు అతనికి మానసికంగా జాలి కలిగించాయి. దాంతో ఆ కోడిని చంపి తినాలనే ఆలోచన పోయి... దాన్ని బతికించాలనే ఆలోచన పుట్టుకొచ్చింది.

mike the headless chicken, headless chicken, chicken, the headless chicken, mike the headless chicken festival, headless chicken running, headless chicken mike, mike the chicken, mike chicken, mike the headless chicken day, mike the headless chicken song, mike the headless chicken hoax, mike the headless chicken story, తల లేని కోడి, 18 నెలలు బతికిన కోడి, తల లేకుండా బతికిన కోడి
తలలేని కోడి (Image : Wikipedia)


కళ్లలో చుక్కలు వేసేందుకు ఉపయోగించే ఐ డ్రాపర్‌తో కోడి మెడలోకి పాలు, నీళ్లూ పోశాడు. అదే విధంగా... చిరు ధాన్యాలు, మొక్కజొన్న, చిన్న చిన్న పురుగుల్ని కూడా ఓ సిరంజి గొట్టం ద్వారా మెడలోంచీ పొట్టలోనికి పోనిచ్చాడు. ఈ విషయం మెల్లమెల్లాగా ఊరంతా తెలిసింది. అప్పట్లో ఈ విషయం తెలుసుకున్నవారంతా అబద్ధమని కొట్టిపారేసేవాళ్లు. అది నిజమని నిరూపిస్తూ... లాయిడ్... ఆ కోడిని సాల్ట్ లేక్ సిటీలోని ఉతా యూనివర్శిటీకి తీసుకెళ్లి మరీ ప్రపంచానికి వాస్తవాన్ని చూపించాడు. అంతే ఎక్కడెక్కడి వారో వచ్చి ఆ కోడిని చూసి... దాన్నీ, దాన్ని బతికిస్తున్న లాయిడ్‌నీ ఫొటోలు తీసేవారు. డజన్ల కొద్దీ మేగజైన్లూ, పేపర్లూ ఈ విషయాన్ని ప్రచురించాయి. ప్రముఖ టైమ్, లైఫ్ మ్యాగజైన్లలోనూ ఫీచర్ స్టోరీగా ఇచ్చారు.

mike the headless chicken, headless chicken, chicken, the headless chicken, mike the headless chicken festival, headless chicken running, headless chicken mike, mike the chicken, mike chicken, mike the headless chicken day, mike the headless chicken song, mike the headless chicken hoax, mike the headless chicken story, తల లేని కోడి, 18 నెలలు బతికిన కోడి, తల లేకుండా బతికిన కోడి
తలలేని కోడి (Image : Wikipedia)


తలలేని మైక్‌ని చూపించాలంటే... 25 సెంట్లు (ఇప్పుడైతే రూ.15) ఇవ్వాలనే కండీషన్ పెట్టాడు లాయిడ్. అయినా సరే జనం తండోపతండాలుగా వచ్చి కోడిని చూశారు. అలా లాయిడ్ నెలకు $4,500 (రూ.3,19,659) (ఇప్పటి లెక్కల ప్రకారం రూ.35,87,284) సంపాదించేవాడు. ఫలితంగా మైక్ విలువ అప్పట్లో $10,000 (రూ.7,10,353) పలికింది.

1947 మార్చి 17న అర్థరాత్రివేళ కోడి అరుపులు వినిపించాయి. మైక్ వెంటనే దాని మెడలోకి మొక్కజొన్న పోనిచ్చాడు. ఐతే... ఆ టైంలో అతని దగ్గర సిరంజి గొట్టం లేదు. ముందు రోజే వాటిని క్లీన్ చేసి వేరే చోట పెట్టాడు. డైరెక్టుగా ఆహారాన్ని వెయ్యడం సెట్ కాకపోవడంతో మైక్ చనిపోయింది.


18 నెలలు ఎలా బతకగలిగింది : జుగ్లర్ వెయిన్ (జుగ్లర్ నరం) తెగకపోవడం, రక్తం గడ్డకట్టడం వల్ల కోడి చనిపోకుండా ఉండగలిగింది. బ్రెయిన్, ఓ చెవి కూడా మెడతోపాటూ ఉండటం వల్ల జీవించగలిగింది. గాలిపీల్చడం, హార్ట్ కొట్టుకోవడం వంటి సిగ్నల్స్ పంపించే బ్రెయిన్ నరాలు కట్ అవ్వక పోవడం వల్ల కోడి పూర్తి ఆరోగ్యంతో బతకగలిగింది.ప్రస్తుతం తలలేని కోడి పేరుతో కొలరాడోలోని ఫ్రూయిటాలో ఓ సంస్థ ఉంది. ఏటా మైక్ ది హెడ్ లెస్ చికెన్ డే‌ని నిర్వహిస్తోంది. 1999 నుంచీ మే మూడో వారంలో ఈ డే జరుగుతుంది. ఆ రోజు 5కే రన్, ఎగా టాస్, పిన్ ది హెడ్ ఆన్ ది చికెన్, ది చికెన్ క్లక్ ఆఫ్, చికెన్ బింగో వంటి పోటీలు నిర్వహిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

గుడ్లగూబ ఫొటోను రోజూ చూస్తే... మీకు కలిగే ప్రయోజనాలు ఇవీ...

ఒక గ్రాము తేలు విషం రూ.7,30,000 ఎందుకో తెలుసా? ఆసక్తికర విషయాలు

ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం

వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు
First published: May 13, 2020, 12:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading