• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • MICROSCOPIC ANIMAL SURVIVED 24000 YEARS FROZEN IN THE SIBERIAN PERMAFROST GH SA

Siberian permafrost: 24 వేల ఏళ్ల పాటు జీవించి ఉన్న ప్రాణి.. గుర్తించిన పరిశోధకులు

Siberian permafrost: 24 వేల ఏళ్ల పాటు జీవించి ఉన్న ప్రాణి..  గుర్తించిన పరిశోధకులు

_Siberian permafrost

సైబీరియాలో రోటిఫెర్‌ అనే ఒక మైక్రోస్కోపిక్‌ యానిమల్‌ను ఇలా గుర్తించారు. దీనిని వీల్‌ యానిమాల్‌క్యూల్‌ అని కూడా పిలుస్తారు. అసలు రోటిఫెర్‌ ఎలా అన్నేళ్లు ఎలా బతికి ఉంది

  • Share this:
‘డిస్కో రాజా’ సినిమాలో రవితేజ కొన్నేళ్లపాటు మంచులో ఉండి బతుకుతాడు... గుర్తుందా? అచ్చం అలాగే బతికిన ఓ జీవిని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇక్కడ ఆ జీవి మంచులో ఉండి బతికింది 24 వేల ఏళ్లు అంటే నమ్ముతారా. కానీ ఇది జరిగింది. సైబీరియాలో రోటిఫెర్‌ అనే ఒక మైక్రోస్కోపిక్‌ యానిమల్‌ను ఇలా గుర్తించారు. దీనిని వీల్‌ యానిమాల్‌క్యూల్‌ అని కూడా పిలుస్తారు. అసలు రోటిఫెర్‌ ఎలా అన్నేళ్లు ఎలా బతికి ఉంది, దాని వెనుక కారణాలేంటి అనేది రష్యాలోని సోయిల్‌ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఓ డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేశారు.

క్రిప్టోబేసిస్‌ అనే విధానం ద్వారా ఈ మల్టీ సెల్యులర్‌ యానిమిల్స్‌ వేల సంవత్సరాలు బతకగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మెటబాలిజంను పూర్తిగా ఆపేయడం వల్ల ఇలా వేల ఏళ్ల తరబడి ఆ జీవి ప్రాణంతో ఉందని చెబుతున్నారు. రోటిఫెర్స్‌ ఇంక్రెడిబుల్‌ ఫీట్‌ ఆఫ్‌ సర్వైవల్‌ అనే పేపర్‌లో ఈ వివరాలను రాసుకొచ్చారు. రోటిఫెర్స్‌ అనే పేరు లాటిన్‌ నుండి వచ్చింది. వాటికి ఉండే చిన్నపాటి జుట్టు చక్రంలా తిరిగి ఉంటుంది. అందుకే దానికి వీల్‌ అనే అర్థం వచ్చేలా ‘వీల్‌ యానిమాల్‌క్యూల్స్‌’ అంటారు.

రష్యాకు చెందిన శాస్త్రవేత్తల బృందం సరికొత్త డ్రిల్లింగ్‌ టెక్నిక్స్‌తో శాంపిల్స్‌ను సేకరించారు. అలా 11 అడుగుల దిగువన సేకరించిన శాంపిల్స్‌లో ఈ రోటిఫెర్స్‌ కనిపించింది. దానిని పరిశీలించడానికి శాస్త్రవేత్తలు రేడియో కార్బన్‌ డేటింగ్‌ విధానాన్ని వినియోగించారు. అలా పరిశీలించాక ఆ రోటిఫెర్స్‌ 24 వేళ్ల ఏళ్లు అయినా ఇంకా బతికి ఉందని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తమ డాక్యుమెంట్‌లో తెలిపారు. దాంతోపాటు కొన్ని బయటపడినా అవి రివైవబుల్‌ కావని తేల్చేశారు. ఇలా మంచులో ఏళ్ల తరబడి ఉన్నా ప్రాణాలు నిలుపుకునే జంతువులు కొన్ని ఉన్నాయి. వాటిలో వాటర్‌ బేర్స్‌గా పిలుచుకునే టార్డిగ్రేడ్స్‌ ఒకటి. మంచులో గడ్డకట్టుకుపోయినా అవి ప్రాణాలతో ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు రోటిఫెర్స్‌ 24 వేల ఏళ్ల తర్వాత కూడా జీవించి ఉండటం కనుగొన్నారు. అయితే రోటిఫెర్స్‌ ఎలా జీవించాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధించారు. కానీ వారికి ఆ జీవి ఎలా ఇన్నాళ్లూ బతికి ఉందనేది తెలియలేదట.

మరోవైపు రష్యన్‌ బృందం మరిన్నిజీవుల మీద ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి వాతావరణంలో ఎలా స్పందిస్తాయనేది తెలుసుకోబోతున్నారు. ఈవిషయంలో శాస్త్రవేత్తలకు స్పష్టత వస్తే మనుషులు కూడా అలా ఉండగలుగుతారా... అనేది తెలుసుకోవాలని చూస్తున్నారట.

Keywords - రష్యా, వాటర్‌ బేర్స్‌, టార్డిగ్రేడ్స్‌ రోటిఫెర్స్‌, rotifers , humans, Siberia, Russia, wheel animalcule, microscopic animal, cryptobiosis
First published:

అగ్ర కథనాలు