పదవికి మాజీలు.. పాపులారిటీలో టాప్.. తగ్గని ఒబామా దంపతుల క్రేజ్

గురువారం గాలప్ సంస్థ విడుదల చేసిన అమెరికన్ల ఆరాధ్య పురుషులు, మహిళలు జాబితాలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 1946 నుంచి గాలప్ సంస్థ ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 3-12తేదీల మధ్యలో ఈ సర్వేను నిర్వహించింది.

news18-telugu
Updated: December 28, 2018, 3:15 PM IST
పదవికి మాజీలు.. పాపులారిటీలో టాప్.. తగ్గని ఒబామా దంపతుల క్రేజ్
బరాక్ ఒబామా, మిషెల్ ఒబామా(File)
  • Share this:
పదవుల్లో లేకపోయినా సరే పాపులారిటీలో మాత్రం తామే టాప్ అని నిరూపిస్తున్నారు ఒబామా దంపతులు. అమెరికన్ల ఆరాధ్యుడిగా వరుసగా 11వ ఏడాది మాజీ అధ్యక్షుడు ఒబామా తొలి స్థానంలో నిలవగా.. మహిళా విభాగంలో మిషెల్ ఒబామా తొలిసారి టాప్‌ స్థానాన్ని దక్కించుకున్నారు. గత 17ఏళ్లుగా అమెరికన్ల ఆరాధ్య మహిళగా టాప్‌లో కొనసాగుతూ వచ్చిన హిల్లరీ క్లింటన్‌ను వెనక్కి నెట్టి మరీ మిషెల్ ఒబామా టాప్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

గురువారం గాలప్ సంస్థ విడుదల చేసిన అమెరికన్ల ఆరాధ్య పురుషులు, మహిళలు జాబితాలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 1946 నుంచి గాలప్ సంస్థ ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 3-12తేదీల మధ్యలో ఈ సర్వేను నిర్వహించింది. గతంలో 1993,1994లలో వరుసగా రెండుసార్లు హిల్లరీ క్లింటన్ అమెరికన్ల ఆరాధ్య మహిళగా టాప్‌లో నిలిచారు. ఆ సమయంలో హిల్లరీ భర్త బిల్ క్లింటన్‌ అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

ఆ తర్వాతి కాలంలో వరుసగా 1997 నుంచి 2000 సంవత్సరం వరకు.. 2002-2017వరకు హిల్లరీయే టాప్‌లో కొనసాగుతూ వచ్చారు. తాజాగా విడుదల చేసిన జాబితాలో మిషెల్ తర్వాతి స్థానంలో ఓఫ్రా విన్‌ఫ్రే, మూడో స్థానంలో క్లింటన్, నాలుగో స్థానంలో మెలానియా ట్రంప్ నిలిచారు. పురుషుల జాబితాలో అధ్యక్షుడు ట్రంప్ నాలుగో స్థానంలో నిలిచారు.

First published: December 28, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు