Miami building collapse: కూలిన 12 అంతస్తుల బిల్డింగ్.. 99 మంది మిస్సింగ్.. క్షణాల్లో అంతా అయోమయం..

(Image-Twitter/Miami-Dade Fire Rescue)

ఓ బిల్డింగ్‌ సగభాగం కుప్పకూలిన ఘటనలో 99 మంది కనిపించకుండా పోయారు. వీరి కోసం రెస్క్కూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

  • Share this:
    ఓ బిల్డింగ్‌ సగభాగం కుప్పకూలిన ఘటనలో 99 మంది కనిపించకుండా పోయారు. వీరంతా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. వీరిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన అమెరికా ఫోర్లిడాలోని మియామి నగరంలో చోటుచేసుకుంది. వివరాలు.. మియామిలోని ఓ 12 అంతస్తుల బిల్డింగ్‌లో కొంత భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 102 మంది ఆచూకీ లభించిందని.. మరో 99 మంది గురించిన సమాచారం తెలియాల్సి ఉందని చెప్పారు. అయితే ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో బిల్డింగ్‌లో మొత్తం ఎంత మంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు.

    ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 35 మందిని బయటకు తీశారు. వారిలో ఇద్దరిని ఆస్పత్రికి పంపగా, మిగిలినవారి గాయాలకు ప్రథమ చికిత్స చేశారు. ఘటన స్థలానికి ఫైరింజన్లు, అంబులెన్స్‌లు కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ టీమ్స్ కృషి చేస్తున్నాయని మేయర్ డేనియల్ లెవిన్ కావా తెలిపారు.

    (Image-Twitter/Miami-Dade Fire Rescue)


    (Image-Twitter/Miami-Dade Fire Rescue)


    ఇక, Surfsideలో ఉనన ఈ బిల్డింగ్‌ను 1980లో నిర్మించారు. అయితే బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దాదాపుగా బిల్డింగ్ సగభాగం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. బిల్డింగ్ కూలిన సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని.. క్షణాల్లో ఆ ప్రాంతంలో దుమ్ము, ధూళితో నిండిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ దశ్యాలు 9/11ను (2001లో న్యూయార్క్ నగరంలో ట్విన్ టవర్ల మీద దాడి) తలపించాయని ఓ వ్యక్తి సీఎన్‌ఎన్‌కు తెలిపారు.





    ఈ ప్రమాదం తర్వాత లాటిన్ అమెరికా నుంచి వలస వచ్చిన పలువురు కనిపించడం లేదని వారి సంబంధించిన దౌత్య కార్యాలయాలు వెల్లడించాయి. మరోవైపు పరాగ్వే ఫస్ట్ లేడీ సిల్వానా లోపెజ్ మొరెయిరా బంధువులు కూడా ఆ దేశ అధికారులు తెలిపారు. కనిపించకుండా పోయిన వారిలో సిల్వానా సోదరి, ఆమె భర్త, వారి పిల్లలతో పాటుగా ఓ వర్కర్ ఉన్నారు. అ రెస్క్యూ టీమ్స్ వీరి ఆచూకీని గుర్తించలేకపోయారు. ఇక, సహాయక చర్యలు చేపట్టే సమయంలో.. మంటలు వచ్చాయని, అయితే అవి 20 నిమిషాల్లో అదుపులోకి వచ్చాయని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published: