• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • MIA KHALIFA TWEETED IN SUPPORT OF THE ONGOING FARMERS AGITATION IN INDIA SSR

మియా ఖలీఫా గుర్తుందా.. ఇప్పుడు భారత్ గురించి ట్వీట్ చేసింది.. వార్తల్లో నిలిచింది..!

మియా ఖలీఫా గుర్తుందా.. ఇప్పుడు భారత్ గురించి ట్వీట్ చేసింది.. వార్తల్లో నిలిచింది..!

మియా ఖలీఫా(ఫైల్ ఫొటో)

కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు ఊహించని వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తోంది. పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా రైతులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలుపుతున్నారు. స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి, ప్రపంచ నాయకులను తన ప్రసంగంతో కడిగిపారేసిన యువ కెరటం గ్రెటా థంబర్గ్ కూడా భారత్‌లో రైతు ఉద్యమానికి...

  • Share this:
    న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు ఊహించని వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తోంది. పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా రైతులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలుపుతున్నారు. స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి, ప్రపంచ నాయకులను తన ప్రసంగంతో కడిగిపారేసిన యువ కెరటం గ్రెటా థంబర్గ్ కూడా భారత్‌లో రైతు ఉద్యమానికి మద్దతు తెలిపింది. ప్రముఖ బార్బేడియన్ సింగర్, నటి, వ్యాపారవేత్త రాబిన్ రిహన్నా కూడా రైతు ఉద్యమానికి తన మద్దతు తెలిపింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. దీని గురించి మనమంతా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించింది. తాజాగా.. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై మాజీ పోర్న్ స్టార్, క్రీడా వ్యాఖ్యాత మియా ఖలీఫా కూడా స్పందించింది. ఏ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ఇంటర్నెట్‌ను న్యూఢిల్లీలో నిలిపివేశారని ఆమె ప్రశ్నించింది. తాను రైతుల పక్షాల నిలబడతానని మియా ట్వీట్ చేసింది.

    అయితే.. సింగర్ రిహన్నా రైతు ఉద్యమానికి మద్దతివ్వడంతో ఆమె ముస్లిం మతానికి చెందిన వ్యక్తి ఏమోనని నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేయడం గమనార్హం. ‘రిహన్నా రెలిజియన్’, ‘రిహన్నా ముస్లిం’ అనే సెర్చ్ వర్డ్స్ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో నిలవడం కొసమెరుపు. అంతేకాదు ‘రిహన్నా’ రైతు ఉద్యమానికి మద్దతివ్వడంపై నటి కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించింది. రైతు ఉద్యమంపై ఏ ఒక్కరూ ఎందుకు మాట్లాడటం లేదని రిహన్నా ట్విట్టర్‌లో సంధించిన ప్రశ్నకు కంగనా ఘాటుగా స్పందించింది. ఏ ఒక్కరూ దాని గురించి మాట్లాడరని.. ఎందుకంటే వాళ్లు రైతులు కారని.. వాళ్లంతా టెర్రరిస్టులని కంగనా తన ట్వీట్‌తో రిహన్నాకు బదులిచ్చింది.

    ‘భారతదేశాన్ని విడగొట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. మా దేశాన్ని నీలాంటి డమ్మీలకు అమ్మేందుకు మేం సిద్ధంగా లేం. మూర్ఖురాలా’ అని రిహన్నాపై కంగనా మండిపడింది. అంతేకాదు, రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన గ్రేటా థంబర్గ్‌పై కూడా కంగనా ఫైర్ అయింది. సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన కోయంబత్తూర్‌కు చెందిన 105 సంవత్సరాల పద్మశ్రీ ఆర్ పప్పమ్మల్ వార్తను పోస్ట్ చేసిన కంగనా నిజంగా.. పర్యావరణం కోసం కోసం కష్టపడిన ఇలాంటి వాళ్ల గురించి ఫ్యాన్సీ యాక్టివిస్టులెవరూ మాట్లాడరని.. చదువుకోవాల్సిన వయసులో స్కూలుకెళ్లకుండా పాడైపోతున్న గ్రేటా థంబర్గ్‌కు మాత్రం గుడ్డిగా ప్రచారం కల్పించేందుకు సిద్ధంగా ఉంటారని కంగనా ట్వీట్ చేసింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు