• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • MIA KHALIFA SPLITS FROM HUSBAND ROBERT SANDBERG AND CALLS OFF WEDDING CELEBRATION SSR

Mia Khalifa: సంచలన ప్రకటన చేసిన మియా ఖలీఫా.. ఇలా జరగడం ఏంటని షాక్‌లో ఆమె అభిమానులు..

మియా ఖలీఫా

మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా గురించి తెలియని కుర్రాళ్లు ఉండరు. మాజీ శృంగార తార, బాలీవుడ్ నటి సన్నీలియోన్ మాదిరిగానే మియా ఖలీఫాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆమె వీడియోలో అప్పట్లో అంతలా కుర్రాళ్లను ఆకర్షించాయి. తాజాగా.. మియా ఖలీఫా తన జీవిత భాగస్వామికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా గురించి తెలియని కుర్రాళ్లు ఉండరు. మాజీ శృంగార తార, బాలీవుడ్ నటి సన్నీలియోన్ మాదిరిగానే మియా ఖలీఫాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆమె వీడియోలో అప్పట్లో అంతలా కుర్రాళ్లను ఆకర్షించాయి. తాజాగా.. మియా ఖలీఫా తన జీవిత భాగస్వామికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా స్వీడిష్ చెఫ్ రాబర్ట్ శాండ్‌బర్గ్‌తో డేటింగ్ చేస్తోంది. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికొచ్చి మార్చి 2019న ఎంగేజ్‌మెంట్ కూడా జరుపుకున్నారు. లీగల్‌గా మియా ఖలీఫా, రాబర్ట్ శాండ్‌బర్గ్ వివాహం చేసుకుని ఇప్పటికే సంవత్సరమైంది. అయితే.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వేడుక జరుపుకోవాలని భావించిన ఈ జంటకు కరోనా అడ్డొచ్చింది. దీంతో.. పెళ్లిని వాయిదా వేసుకున్న మియా, రాబర్ట్ త్వరలో వివాహ వేడుక జరుపుకోనున్నారనే వార్తల నేపథ్యంలో మియా ఖలీఫా తాజా ప్రకటన ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసింది.

    రాబర్ట్‌తో తనకు బ్రేకప్ అయిందని.. తామిద్దరం భార్యాభర్తల బంధానికి గుడ్‌బై చెబుతున్నామని ఇన్‌స్టాగ్రాంలో మియా ఖలీఫా ప్రకటించింది. అయితే.. జీవితాంతం మంచి స్నేహితులుగా ఉండేందుకు తామిద్దరం ప్రయత్నిస్తామని మియా తెలిపింది. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఉంటాయని.. ఎందుకంటే తాము కేవలం కొన్ని అభిప్రాయ భేదాలు రావడం వల్లే విడిపోతున్నామని.. అంతేతప్ప తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మియా తన ప్రకటనలో తెలిపింది.



    తాము ఈ చాప్టర్‌ను(కలిసి ఉండటాన్ని) క్లోజ్ చేస్తున్నామని.. అయితే.. ఎవరికీ పశ్చాతాప భావన లేదని.. తాము తప్పు చేసి విడిపోవడం లేదని ఆమె చెప్పింది. ఇద్దరం వేరువేరుగా మా ప్రయాణాలను మొదలుపెట్టబోతున్నామని.. అయితే ఎప్పటికీ కుటుంబం, స్నేహితుల ద్వారా కలిస్తూనే ఉంటామని మియా తెలిపింది. ఈ ప్రకటన చేస్తున్నందుకు భారంగా అనిపిస్తున్నప్పటికీ తప్పక వేరువేరుగా ముందుకు సాగనున్నట్లు మియా ఖలీఫా పేర్కొంది. ఇదిలా ఉంటే.. మియా ఖలీఫాకు రాబర్ట్‌ కంటే ముందే వేరొకరితో వివాహమైంది. తన హైస్కూల్ బాయ్‌ఫ్రెండ్‌ను 2011లో ఈ 28 ఏళ్ల బ్యూటీ పెళ్లి చేసుకుంది. 2014లో మొదటి భర్తతో అభిప్రాయ భేదాలు రావడంతో 2016లో భర్తకు విడాకులిచ్చింది.



    ఈ క్రమంలోనే.. ఆమె పోర్న్ ఇండస్ట్రీకి ఎంటరై కేవలం మూడు నెలల్లోనే పాపులర్ పోర్న్ స్టార్‌గా మారింది. ఆమె నీలిచిత్రాలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో ఓవర్ నైట్ సెలబ్రెటీ అయింది. అయితే.. మియాకు ఆ సమయంలోనే కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయి. ‘హిజాబ్’ ధరించి శృంగార సన్నివేశాల్లో మియా ఖలీఫా నటించడం అప్పట్లో పెను దుమారం రేపింది.

    మియా ఖలీఫా తన మూడు నెలల పోర్న్ ఇండస్ట్రీ కెరీర్‌లో నంబర్ వన్ రేటెడ్ స్టార్ అయింది. కొన్ని వందల వీడియోల్లో నటించింది. మూడు నెలలు మాత్రమే పోర్న్ ఇండస్ట్రీలో ఉన్న మియా ఖలీఫా ఆ తర్వాత అందులో కొనసాగలేక గుడ్‌బై చెప్పింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 24.7 మిలియన్ల ఫాలోవర్లున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆమె ఒక స్టార్‌గానే నిలిచింది.
    Published by:Sambasiva Reddy
    First published: