హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine War: అష్టదిగ్బంధంలో రష్యా..? జెలెన్స్కీ పిలుపుతో స్పందించిన యూఎస్‌..

Russia-Ukraine War: అష్టదిగ్బంధంలో రష్యా..? జెలెన్స్కీ పిలుపుతో స్పందించిన యూఎస్‌..

పుతిన్, బైడెన్ (ఫైల్)

పుతిన్, బైడెన్ (ఫైల్)

సైనిక సహాయక ప్యాకేజీలో ఉక్రెయిన్‌కు 800 మిలియన్‌ డాలర్ల విలువైన 11, Mi-17 హిప్ హెలికాప్టర్‌లను యూఎస్‌ ప్రకటించింది. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్‌కు భారీ ఆయుధ సామగ్రిని కలిగి ఉన్న ఛాపర్స్‌ పెద్ద బలం.

సైనిక సహాయక ప్యాకేజీలో ఉక్రెయిన్‌కు(Ukraine) 800 మిలియన్‌ డాలర్ల విలువైన 11, Mi-17 హిప్ హెలికాప్టర్‌లను(Heli crafters) యూఎస్‌ ప్రకటించింది. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్‌కు భారీ ఆయుధ సామగ్రిని కలిగి ఉన్న ఛాపర్స్‌ పెద్ద బలం. ఏప్రిల్ 13న బైడెన్‌తో(Biden) జరిగిన సంభాషణలో Mi-17 హెలికాప్టర్‌లను అందించాలని జెలెన్స్కీ కోరినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఉక్రెయిన్‌కు(Ukraine) అదనపు హెలికాప్టర్లను అందించేందుకు ఆమోదం తెలిపినట్లు బైడెన్‌ పేర్కొన్నాడు. అంతకుముందు యూఎస్‌(US) రక్షణ అధికారులను ఉటంకిస్తూ హెలికాప్టర్లు సైనిక ప్యాకేజీలో(Package) భాగం కాదని నివేదికలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌ ముందుగా Mi-17లను కోరుకొంటోందా? లేదా? అనే అంశంలో యూఎస్‌కు(US) స్పష్టత కొరవడింది. అనంతరం హెలికాప్టర్లు ప్యాకేజీలో భాగమని యూఎస్‌ రక్షణ శాఖ ధ్రువీకరించింది. యుద్ధభూమికి ఉక్రెయిన్‌(Ukraine) దళాలను తరలించడానికి, పోరాడటానికి సాయంగా యూఎస్‌ ప్యాకేజీ ప్రకటించామమని యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌(Department Of Defense) పేర్కొంది. ప్యాకేజీలో 100 ఆర్మ్డ్‌ హమ్వీ వాహనాలు, 200ల M113 ఆర్మ్డ్‌ పర్సనల్ క్యారియర్లు, 11, Mi-17 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్‌కు పంపిన ఐదు Mi-17 హెలికాప్టర్లకు అదనంగా పంపేందుకు యూఎస్‌ నిర్ణయం తీసుకుంది.

Petrol Diesel: షాకింగ్ లెక్కలు -మూడేళ్ల గరిష్టానికి ఇంధన డిమాండ్ -పెట్రోల్ అమ్మకాల రికార్డు


Mi-17 హెలికాప్టర్‌ల ప్రభావమెంత..?

Mi-17 "హిప్" ప్రపంచంలోని అత్యంత ఆధునిక రవాణా హెలికాప్టర్లలో ఒకటి. రష్యా తయారు చేసిన ఛాపర్ క్యాబిన్ లోపల మరియు బాహ్య స్లింగ్‌లో సరుకును రవాణా చేసే సదుపాయం. హెలికాప్టర్‌లో ముగ్గురు సిబ్బందితో పాటు 36 మంది ప్రయాణించే అవకాశం ఉంది. Shturm-V మిసైల్స్‌, S-8 రాకెట్లు, 23mm మెషిన్ గన్, PKT మెషిన్ గన్స్, AKM సబ్ మెషిన్ గన్‌లను హెలికాప్టర్ మోసుకెళ్లగలదు. హెలికాప్టర్‌లోని ఎనిమిది ఫైరింగ్ పొజిషన్స్‌ నుంచి దాడులు చేయగల సామర్థ్యం ఉంటుంది. గన్నర్‌ను, కాక్‌పిట్ సిబ్బందిని ఏదైనా దాడి నుండి రక్షించేలా హెలికాప్టర్‌లోని ఆర్మ్డ్‌ ప్లేట్లు ఉన్నాయి. ఈ హెలికాప్టర్‌లను వినియోగిస్తున్న 70 కంటే పైగా దేశాలలో భారతదేశం, రష్యా, చైనా, యుఎస్, పాకిస్థాన్‌, కెనడా, యూకే ఉన్నాయి. 2021 ఆగస్టులో యూఎస్‌ మద్దతుగల ప్రభుత్వం కూలిపోవడానికి ముందు ఆఫ్ఘనిస్థానక్‌కు Mi-17 తరలించినట్లు రిపోర్ట్స్‌లో పేర్కొన్నారు.

Lord Hanuman: హనుమంతుడు ఈ యువకుడి రూపంలో మళ్లీ పుట్టాడా? అందుకు ఆధారం ఇదేనా?

MI-17 స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. గరిష్ఠ వేగం గంటకు 250 కి.మీ, గరిష్ఠ టేకాఫ్ బరువు 13,000 కేజీలు, పరిధి 465 కి.మీ వరకు ఉంటుంది. గరిష్ఠ ఎత్తు 19,690 అడుగులు. కెపాసిటీ 36 ట్రూప్స్ లేదా 12 స్ట్రెచర్స్. MI-17 హెలికాప్టర్‌లు ఉక్రెయిన్‌కు ఎలా సహాయపడతాయంటే.. కీవ్‌ను స్వాధీనం చేసుకునే యత్నంలో విఫలమై.. ఇప్పుడు ఉక్రెయిన్ తూర్పు వైపు దాడులు చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. ఉక్రెయిన్ దళాలు బలంగా నిలబడినప్పటికీ.. NATO నుంచి అందుతున్న పరిమిత సాయంతోనే పోరాటం చేస్తోంది. బుచాలో హత్యలు, రష్యన్ దురాగతాలతో సైనిక సాయాన్ని విస్తరించాలని పిలుపు ఇచ్చాయి.


Business Idea: ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్... రూ.70,000 పెట్టుబడి చాలు

భూభాగా రక్షణకు, తూర్పు వైపు కదులుతున్న ఉక్రెయిన్ దళాలకు యూఎస్‌ 11, Mi-17 ఉపయోగపడనున్నాయి. యుద్ధభూమి చుట్టూ సిబ్బందిని, పెద్ద సామగ్రిన తరలించడానికి హెలికాప్టర్‌లు ఉపయోగపడనున్నాయి. గాయపడిన సైనికులను లేదా పౌరులను రక్షించేందుకు, నిర్దిష్ట ప్రదేశాలలో అదనపు దళాలను మోహరించేందుకు ఉపయోగం. మిలిటరీ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రత్యర్థుల దళాలు, సాయుధ వాహనాల లక్ష్యంగా Mi-17 నుంచి దాడులు చేసే సదుపాయం ఉంటుంది. యాంటి ట్యాంక్‌ మిసైల్స్‌, గైడెడ్ రాకెట్లు, గన్ పాడ్‌లు కలిగిన గన్‌షిప్‌లుగా పనిచేసేలా హెలికాప్టర్లను తయారు చేశారు.

First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు