Home /News /international /

MEXICO SHOOTING AT LEAST EIGHT PEOPLE INCLUDING TWO CHILDREN DIED IN A SHOOTING IN A REGION OF CENTRAL MEXICO SK

Mexico Gun Attack: రెండ్ గ్యాంగ్‌ల మధ్య గన్ ఫైట్.. భీకర కాల్పుల్లో 8 మంది మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mexico Gun Fight: మెక్సికోలో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం సర్వ సాధారణమయింది. వీరి గొడవల మధ్య సాధారణ ప్రజలు బలవుతున్నారు.

    మెక్సికో (Mexico)లో దారుణం జరిగింది. రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్‌ (Mexico Gun Fight)తో నెత్తుటేరులు పారాయి.  ఓ వర్గంపై మరో వర్గం వారు కాల్పులు జరపడంతో ఎనిమింది మంది మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో పలువురు చిన్నారులు ఉన్నారు. సెంట్రల్ మెక్సికో గువానాజోటో ప్రావిన్స్‌లో ఈ ఘోరం జరిగింది. రాత్రివేళ పలువురు వ్యక్తులు ఓ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి బయట ఉన్న నలుగురు వ్యక్తులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. వారిపై తూటాల వర్షం కురిపించారు. బుల్లెట్ గాయాలతో ఆ నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఐతే కొన్ని బుల్లెట్లు పక్క ఇంట్లో నివసించే వారిపైకి దూసుకెళ్లాయి. దాంతో మరో ఇద్దరు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు.

    అమెరికాలో Omicron కొవిడ్ కల్లోలం.. ఒక్కరోజులోనే 5లక్షల కొత్త కేసులు.. నెలలో 45వేల మరణాలు

    మెక్సికోలో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం సర్వ సాధారణమయింది. ఇక మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో గువానాజోటో ఒకటి. ఇకడ్క తరచూ గ్యాంగ్ వార్స్ జరుగుతుంటాయి. ముఖ్యంగా శాంటా రోసోడి లిమా, జలిసో న్యూ జనరేషన్స్ కార్టెల్స్ గ్రూప్‌ల మధ్య గన్ ఫైట్స్ జరుగుతుంటాయి. వీరి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలరచేత పట్టుకొని నివసిస్తున్నారు. నవంబరులో కూడా ఇలాంటి ఘోరమే జరిగింది. సిలావోలో రెండు వర్గాల మధ్య జరిగిన గన్ ఫైట్ ఘటనలో 11 మంది మరణించారు.

    Gold Mine Collapse: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి

    మెక్సికోలో గత నెలలో ఘోర రోడ్డు ప్రమాదం కూడా జరిగిన విషయం తెలిసిందే. హైవే కార్లను ట్రక్కు ఢీకొనడంతో 19 మంది చనిపోయారు. ఓ ట్రక్కు అతివేగంగా దూసుకొని టోల్ బూత్‌ను ఢీకొట్టింది. అనంతరం కార్లపైకి దూసుకెళ్లింది. ట్రక్కు ఢీకొన్న ఘటనలో మొత్తం ఆరు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన సెకన్ల వ్యవధిలోనే వాహనాల్లో నుంచి గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవిచింది. దీంతో ఆ ప్రాంతమంతా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ట్రక్కుతోసహా ఆరు కార్లు పూర్తిగా కాలిపోగా.. అందులోని ప్రయాణికులు కూడా అహుతైపోయారు. ఈ ఘటనలో మొత్తం 19 మంది చనిపోయారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International, International news, Mexico, Shooting

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు