మెక్సికోలో ఘోర రోడ్డుప్రమాదం (Mexico Road Accident) జరిగింది. ఓ ట్రక్కు అతివేగంతో అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన పడిపోయింది. ఈ దుర్ఘటనలో 54 మరణించారు. మరో 55 మంది గాయపడ్డారు. దక్షిణ మెక్సికోలోని చియాపాస్ (Chiapas road accident) రాష్ట్రంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో పాటు ట్రక్కు ఓవర్ లోడ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చియాపాస్ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. ట్రక్కులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని, వారంతా అక్రమ వలసదారులని పేర్కొన్నారు. దక్షిణ మెక్సికిలో వలసదారుల అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుంటుంది. పొరుగు దేశాల నుంచి అనేక మంది వలసదారులు అధికారుల కళ్లు గప్పి మెక్సికోలోకి వస్తుంటారు. అనంతరం అక్కడి నుంచి టక్కుల ద్వారా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటారు. చియాపాస్‌లో ప్రమాదానికి గురైన ట్రక్కు కూడా అక్రమల వలసదారులదే. వారిని కార్గో ట్రక్కులో తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రక్కులో దాదాపు 110 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. అంతమందితో వెళ్తున్న ట్రక్కు.. అతివేగంతో పాదచారుల రెయిలింగ్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. అందువల్లే ఎక్కువ ప్రాణ నష్టం జరిగినట్లు వెల్లడించారు.
Amazonకు గట్టి షాక్ ఇచ్చిన ఇటలీ.. భారీ జరిమానా.. ఎందుకంటే?
మెక్సికోలో కొన్ని రోజులుగా ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు వారాల క్రితం యాత్రికులతో వెళ్తతున్న ఓ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న భవనంలోకి (Bus Rams into Building) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. మెక్సికో సిటీ (Mexico city accident)లోని జాక్వికింగో ప్రాంతాల్లో నవంబరు 28న ఈ ఘటన జరిగింది. చల్మా పట్టణం క్రిస్టియన్లకు పుణ్యక్షేత్రం. డిసెంబరు 12న మెక్సికోలో వర్జిన్ ఆఫ్ గ్వాడలుపే డేను రోమన్ క్యాథలిక్కులు ఘనంగా జరుపుకుంటారు. చాలా మంది యాత్రికుచాల్మా పట్టణాన్ని సందర్శిస్తారు. వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం వస్తోంది. ఈ క్రమంలోనే మిచోకన్ పట్టణానికి చెందిన పలువురు యాత్రికులు బస్సులో చల్మా పట్టాణానికి వెళ్తుండగా..బ్రేకులు ఫెయిలై రోడ్డు ప్రమాదం జరిగింది.
Explained: అంబర్‌గ్రిస్ అంటే ఏంటి..? దానికి ఎందుకంత డిమాండ్.. ఫ్లోటింగ్ గోల్డ్ అని
కాగా, నెల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే చోటచేసుకుంది. మెక్సికో సిటీని ప్యూబ్లాను కలిపే హైవేపై ట్రక్కు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించారు. ఈ దుర్ఘటనలను మరవకముందే చియాపాస్‌లో మరో రోడ్డు ప్రమాదం జరగడం.. ఇప్పుడు 50 మందికి పైగా మంది మరణించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్యం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International, International news, Mexico, Road accident