మెక్సికోను వణికించిన భారీ భూకంపం..

ప్రతీకాత్మక చిత్రం

భారీ శబ్దంతో భూమి కంపించడంతో మెక్సికన్లు వణికిపోయారు. ప్రాణా భయంతో ఇళ్ల నుంచి వీధులు, రోడ్ల మీదకు పరుగులు తీశారు. అంతేకాదు సునామీ రాబోతోందన్న భయంతో తీర ప్రాంతాల్లోని చాలా మంది ప్రజను ఇళ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు.

  • Share this:
    మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదైందని యూఎస్‌ జియోలాజికల్‌‌ సర్వే ప్రకటించింది. ఆక్సాకా తీరంలోని శాన్ మైగుల్‌డెల్ ప్యూర్టోకు 31 కి.మీ. దూరంలో భూంకంప కేంద్రం ఉందని తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.28 గంటలకు ఈ భూకంపం సంభవించిందని వెల్లడించింది. భారీ శబ్దంతో భూమి కంపించడంతో మెక్సికన్లు వణికిపోయారు. ప్రాణా భయంతో ఇళ్ల నుంచి వీధులు, రోడ్ల మీదకు పరుగులు తీశారు. అంతేకాదు సునామీ రాబోతోందన్న భయంతో తీర ప్రాంతాల్లోని చాలా మంది ప్రజను ఇళ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. భూకంప ధాటికి పలు ఇళ్ల గోడలు బీటు వారాయని.. మరికొన్ని పాత భనవాలు కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    First published: