ప్రముఖ రాక్‌స్టార్ ఆత్మహత్య... మీటూ ఆరోపణలతో మనస్తాపం

‘నా మరణం నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కాదన్నారు. నా అమాయకత్వాన్ని చూసి నాపై దారుణమైన ఆరోపణలు చేశారు రాక్‌స్టార్ వెగా గిల్.

news18-telugu
Updated: April 3, 2019, 9:48 AM IST
ప్రముఖ రాక్‌స్టార్ ఆత్మహత్య... మీటూ ఆరోపణలతో మనస్తాపం
రాక్‌స్టార్ అర్మాండో వెగా గిల్
news18-telugu
Updated: April 3, 2019, 9:48 AM IST
మీటూ ఆరోపణలతో మనస్తాపం చెందిన మెక్సికన్ రాక్‌స్టార్ ఆర్మాండో వెగా గిల్ ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం ఆయన సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు. వెగా గిల్ 13 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొద్దికాలంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నాడు. అయితే అనూహ్యంగా సోమవారం ఆత్మహత్య చేసుకోవడం మ్యూజిక్ ప్రపంచంలో సంచలనం రేపింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గిల్ సూసైడ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సూసైడ్ నోట్ రాసిన వెగా గిల్.. ‘నా మరణం నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కాదన్నారు. నా అమాయకత్వాన్ని చూసి నాపై దారుణమైన ఆరోపణలు చేశారు. నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు గిల్’.

మరోవైపు గిల్ మరణంపై ఆయన స్థాపించిన బాసిస్ట్ ఆఫ్ మెక్సికన్ రాక్ బ్యాండ్ బొటెల్లిటా డీజెరేజ్ సంస్థ ప్రతినిధులు స్పందించారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి రెండు గంటలు ముందు తమతో మాట్లాడారన్నారు. లైంగిక ఆరోపణలతో గిల్ మానసికంగా కుంగిపోయారన్నారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఎలా తుడిచివేసుకోవాలనే ఆందోళన వ్యక్తంచేశారు. మాట్లాడినంత సేపు తీవ్ర మనస్తాపంలో ఉన్నారన్నారు. మరోవైపు వెగా గిల్ మరణంతో పాటు... మీటూ ఉద్యమంపై సోషల్ మీడియాలో ఉధృతంగా చర్చ జరుగుతోంది. గిల్ ఎలాంటి తప్పు చేయకుంటే.. నిజాయితీగా నిరూపించుకోవాల్సిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఇవికూడా చదవండి: 

నైజీరియన్లు పిజ్జాలను విమానాల్లో తెప్పించుకుంటున్నారు... నైజీరియా మంత్రి కామెంట్లపై దుమారంVideo : చూస్తుండగానే సునామీ వచ్చేస్తే... ప్రాణభయంతో పరుగులు పెట్టిన టూరిస్టులు...
First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...