Couple: ఇద్దరికీ 50 ఏళ్లు నిండాయి.. ఈ వయసులో ఇంతటి పాపానికి ఒడిగట్టారు.. ఎందుకయ్యా..

కందసామి కణ్ణన్, కుముత్తిని కణ్ణన్

ఆ భార్యాభర్తలిద్దరూ భారతీయులే. తమిళనాడు నుంచి ఆస్ట్రేలియా వెళ్లి మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డారు. ఇద్దరికీ ప్రస్తుతం వయసు 50 ఏళ్లకు పైగానే ఉంది. వాళ్లింట్లో పనులు చేయించుకునేందుకు ఓ మహిళను 2007లో తమిళనాడు నుంచి మెల్‌బోర్న్‌కు తీసుకెళ్లారు.

 • Share this:
  మెల్‌బోర్న్: ఆ భార్యాభర్తలిద్దరూ భారతీయులే. తమిళనాడు నుంచి ఆస్ట్రేలియా వెళ్లి మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డారు. ఇద్దరికీ ప్రస్తుతం వయసు 50 ఏళ్లకు పైగానే ఉంది. వాళ్లింట్లో పనులు చేయించుకునేందుకు ఓ మహిళను 2007లో తమిళనాడు నుంచి మెల్‌బోర్న్‌కు తీసుకెళ్లారు. ఆ మహిళతో కొన్నాళ్లు బాగానే వ్యవహరించిన ఈ వృద్ధ దంపతులు ఆ తర్వాత ఆమె పట్ల కర్కశంగా వ్యవహరించారు. ఇంట్లో పని మనిషి పేరుతో ఆమెను బానిసను చేసుకున్నారు. తిట్టి, కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఏ స్థాయిలో పైశాచికంగా ప్రవర్తించారంటే.. కొట్టి హింసించడంతో ఆ మహిళ నోట్లో పళ్లన్నీ ఊడిపోయిన పరిస్థితి. 2007 నుంచి 2015 వరకూ ఆ పెద్దావిడను నానా బాధలు పెట్టిన ఈ వృద్ధ జంటకు తాజాగా.. విక్టోరియా సుప్రీం కోర్టు శిక్ష విధించింది. ఆమెను బానిసగా చేసుకుని హింసించినందుకు గానూ వృద్ధ దంపతుల్లో భర్తకు ఎనిమిదేళ్ల జైలు శిక్ష, భార్యకు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఇంత జరిగినా.. ఆ దంపతులు కనీస పశ్చాతాపం వ్యక్తం చేయకపోవడం వారి క్రూరత్వానికి నిదర్శనం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కందసామి కణ్ణన్(57), కుముత్తిని కణ్ణన్(53) భార్యాభర్తలు.

  ఈ ఇద్దరూ కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. మౌంట్ వేవర్లీలో ఈ దంపతులకు ఇల్లు కూడా ఉంది. 2007లో ఓ నడి వయసు ఉన్న మహిళను ఇంట్లో పని మనిషిగా ఉంచే పేరుతో తమిళనాడు నుంచి ఓ మహిళను ఇంటికి తీసుకెళ్లారు. కొన్నాళ్లు ఆ మహిళతో బాగానే ఉన్నారు. కానీ.. రానురానూ ఏమైందో గానీ ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆమెను పని మనిషి పేరుతో బానిసగా చేసుకుని తిట్టికొట్టి హింసించారు. సరిగ్గా తినడానికి తిండి కూడా పెట్టకుండా నరకం చూపించారు. ఆమె వండితే తిని.. ఆమెకు మాత్రం కడుపు నిండా పెట్టేవారు కాదు. ఈ వృద్ధ దంపతుల అకృత్యం 2015లో వెలుగులోకి వచ్చింది. వీళ్లు పెట్టిన బాధలు తాళలేక 2015 జులైలో ఆ పెద్దావిడ మూత్రపు మడుగులో పడి ఉంది. ఆమెను అలా చూసిన కణ్ణన్ దంపతులు ఆమె చనిపోతే చిక్కుల్లో పడతామని భావించి పారామెడిక్స్‌ను పిలిపించారు.  ఆ పారామెడిక్ ఆమెను పరీక్షించగా.. ఆమె కేవలం 40 కేజీల బరువుతో.. ఆమె శరీర ఉష్ణోగ్రత 28.5Cకి పడిపోయినట్లు తెలిసింది. ఆమెకు షుగర్ ఉందని.. శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో.. ఆ పారామెడిక్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా.. ఈ భార్యాభర్తలు చేసిన అమానవీయ అకృత్యం వెలుగులోకి వచ్చింది. ఆ బాధితురాలి వయసు ప్రస్తుతం 67 సంవత్సరాలు. ఈ అమానుష ఘటనపై విక్టోరియా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ చాంపియన్ తీవ్రంగా స్పందించారు. ఈ దంపతుల పట్ల ఎవరూ.. ఎలాంటి కనికరం చూపరాదని.. వీళ్లు చేసిన పని కచ్చితంగా మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించడమేనని న్యాయమూర్తి తీర్పు వెలువరించిన సందర్భంలో వ్యాఖ్యానించారు.
  Published by:Sambasiva Reddy
  First published: