MELANIA TRUMP JUST WANTS TO GO HOME NEW REPORT SAYS THE FIRST LADY IS PRIVATELY PLANNING LIFE AFTER THE WHITE HOUSE READ HERE MS
Melania Trump: ఒంటరిగా బతకడానికి నిశ్చయించుకున్న మెలానియా.. ట్రంప్ ఒప్పుకుంటాడా..?
మెలానియా ట్రంప్.. (ఫైల్)
అమెరికా ఎన్నికల్లో తాను ఓడిపోలేదని.. తాను పట్టు వదలని విక్రమార్కుడికి దగ్గరి బంధువునని.. చివరికంటా కొట్లాడతానని భీష్మించుకున్నాడు ట్రంప్. ఈ వ్యవహారం అంతా చూసి ఆయన భార్య మెలానియా ట్రంప్ కు విసుగొచ్చినట్టుంది. అందుకే ఆమె వైట్ హౌస్ నుంచి వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంటున్నది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసి దాదాపు నెల కావొస్తుంది. Joe biden కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. వచ్చే ఏడాది ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. కానీ తాజా మాజీ అధ్యక్షుడు ట్రంప్ (donald trump) మాత్రం ఇంకా బైడెన్ విజయాన్ని అంగీకరించడం లేదు. ఎన్నికల్లో గోల్ మాల్ జరిగిందంటూ ఆ కోర్టు.. ఈ కోర్టు అంటూ అమెరికా అంతా తిరుగుతున్నారు. ఎక్కడా ఆయనకు ఊరట లభించలేదు. ‘అంత అహం పనికి రాదు.. ఇక దిగిపో..’ అని సొంత మనుషులే అంటున్నా.. తాను పట్టు వదలని విక్రమార్కుడికి దగ్గరి బంధువునని.. చివరికంటా కొట్లాడతానని భీష్మించుకున్నాడు. ఈ వ్యవహారం అంతా చూసి ఆయన భార్య మెలానియా ట్రంప్ (melania trump) కు విసుగొచ్చినట్టుంది. అందుకే ఆమె వైట్ హౌస్ నుంచి వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంటున్నది.
ఇప్పటికే వీరిద్దరూ విడిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. విడిపోతే ఆస్తుల పంపకం ఎలా అనేదాని మీద కూడా అప్పట్లో చర్చలు నడిచాయి. ఇక చాలా రోజుల నుంచే వీళ్లిద్దరూ... మీకు మీరే మాకు మేమే అనుకుంటున్నారంట. ఒకరి బెడ్ రూం లోకి ఒకరు వెళ్లడం కూడా లేదంట. వారి వ్యక్తిగత విషయాలను వదిలేస్తే.. మెలానియా ట్రంప్.. అతి త్వరలోనే వైట్ హౌస్ నుంచి వెళ్లిపోవాలని.. ఫ్లోరిడాకు సమీపంలో ఉన్న Mar-a-lago లో ఒక అపార్ట్మెంట్ కూడా తీసుకున్నారని సమాచారం. దానికి తుది మెరుగులు దిద్దుతున్నారని.. అది పూర్తయ్యాక.. మెలానియా కొడుకుతో కలిసి అక్కడకు వెళ్లనుందని అమెరికా మీడియా లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మెలానియాకు 14 ఏళ్ల వయసున్న కొడుకు బారన్ ట్రంప్ ఉన్నాడు. ఒకవేళ ఆమె డొనాల్డ్ ట్రంప్ తో విడిపోతే.. భరణం కూడా భారీస్థాయిలోనే ముట్టనుంది. ఈ డబ్బులతో తన తదుపరి జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతో మెలానియా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వైట్ హౌస్ నుంచి వెళ్లిపోయాక ఆమె పూర్తిగా ప్రైవేట్ లైఫ్ గడపానికే నిశ్చయించుకున్నారట. ఫ్లోరిడా లో తాము నిర్మించుకుంటున్న భవనం పూర్తైన వెంటనే అక్కడకు వెళ్లి.. కొడుకు చదువు గురించి చూసుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులాగితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి. మరి దీనికి ట్రంప్ ఒప్పుకుంటాడా..? లేదా..? అన్నది వేచి చూడాలి.