9/11 : మీరేంటి... ఆ డ్రస్సేంటి... మెలానియా ట్రంప్‌పై నెటిజన్ల ఫైర్

9/11 Attacks : అమెరికా చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం ఏదంటే టక్కున చెప్పొచ్చు... 9/11 ఉగ్రవాదదాడులు అని. దాడుల్లో మృతులను తలచుకుంటూ... గతేడాది నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లిన మెలానియా వేసుకున్న డ్రెస్‌పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. కారణం తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 14, 2019, 9:50 AM IST
9/11 : మీరేంటి... ఆ డ్రస్సేంటి... మెలానియా ట్రంప్‌పై నెటిజన్ల ఫైర్
మెలానియా డ్రెస్‌పై విమర్శలు (Source - AFP)
  • Share this:
అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు ట్రంప్ భార్య మెలానియా (49) వేసుకున్న డ్రెస్‌పై నెటిజన్లు భగ్గుమంటున్నారు. 2001లో జరిగిన 9/11 ఉగ్రవాద దాడుల మృతులకు గతేడాది పెన్సిల్వేనియాలో నివాళి అర్పించేందుకు ట్రంప్‌తో కలిసి వెళ్లిన ఆమె... ప్రత్యేక కోట్ వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్రంప్... తాజాగా 9/11 సందర్భంగా... నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఐతే... మెలానియా వేసుకున్న కోట్ వెనకవైపు ప్రత్యేక డిజైన్ ఉంది. అది స్కైస్క్రాపర్‌లా ఉందనీ... అందులోంచీ విమానం బయటకు దూసుకొస్తున్నట్లుగా కనిపిస్తోందని ఓ నెటిజన్ ముందుగా గుర్తించారు. అలా స్టిచ్చింగ్ చేసిందెవరు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దాడుల మృతులను మెలానియా అవమానిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఐతే... వైట్‌హౌస్ ప్రతినిధి స్టెఫానీ గ్రిషామ్ మాత్రం నెటిజన్లపై రివర్స్ అయ్యారు. ఆమె వేసుకున్న కాస్ట్యూమ్‌లో తప్పేముందన్న ప్రతినిధి... ప్రతి దాన్నీ గుచ్చిగుచ్చి చూస్తే ఇలాగే ఉంటుందని కౌంటరేశారు.

melania trump,donald trump,melania,trump,melania trump fashion,first lady melania trump,barron trump,melania and trump,melania trump hat,who is melania trump,melania trump outfit,melania trump jacket,melania jacket,melania trump outfits,melania trump clothes,does melania like trump,melania trump interview,melania trump hand video,melania trump languages,melania trump i don't care,melania trump in slovenia,మెలానియా ట్రంప్,డొనాల్డ్ ట్రంప్, 9/11 ఉగ్రవాద దాడులు, సెప్టెంబర్ 11 దాడులు,
మెలానియా డ్రెస్‌పై విమర్శలు (Source - AFP)


మెలానియా వేసుకున్నది అత్యంత కాస్ట్‌లీ నేవీ బ్లూ హార్వే పియర్రే కోట్. దానిపై ఉన్న వైట్ స్టిచ్చింగ్‌పై వస్తున్న విమర్శలు... ఇదివరకు ఎప్పుడూ ఆమెకు రానంత ఎక్కువగా ఉన్నాయి. మెలానియా కోట్‌లో ట్విన్ టవర్స్‌లో ఒక దాన్ని విమానం క్రాష్ చేసిందా అని ఓ నెటిజన్ ప్రశ్నించారు.

మెలానియా డ్రెస్‌పై విమర్శలు (Source - AFP)


ఈ కోటును ఇలా తయారుచేసిన వాళ్లపై మెలానియా చర్యలు తీసుకున్నారా అని మరో నెటిజన్ ప్రశ్నించారు. ప్రజలతో తిట్లు తినడానికే మెలానియా ఇలాంటి కోట్ వేసుకున్నారా అని మరో నెటిజన్ సెటైర్ వేశారు. ట్రంప్‌ పరువు తీసేందుకే ఇలాంటి కోట్ వేసుకొని ఉంటారని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

మెలానియా డ్రెస్‌పై విమర్శలు


మెలానియా డ్రెస్‌పై విమర్శలు
మెలానియా డ్రెస్‌పై విమర్శలు


ఇదివరకు కూడా చాలాసార్లు మెలానియా... తన కాస్ట్యూమ్స్‌తో వివాదాలకు కేరాఫ్ అయ్యారు. 2018 జూన్‌లో కుటుంబ సభ్యులకు దూరమైన శరణార్థ బాలల్ని కలుసుకునేందుకు వెళ్తూ ఆమె... "ఐ రియల్లీ డోంట్ కేర్.. మీరూ?" అనే పదాలున్న రూ.3వేల జాకెట్ వేసుకున్నారు. అప్పట్లో దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శరణార్థులపై ట్రంప్ అభిప్రాయాన్ని ఈ జాకెట్ బయటపెడుతోందని నెటిజన్లు విమర్శించారు.

మెలానియా డ్రెస్‌పై విమర్శలు (Source - AFP)
First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading