అదృష్టం అంటే ఇదే.. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకని రూ. 7 కోట్లు సొంతం చేసుకున్న యువతి..

ప్రతీకాత్మక చిత్రం

గతేడాది ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఓ యువతిని అదృష్టం వరించింది. ఇటీవల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఆమె.. లాటరీలో రూ. 7 కోట్లు ప్రైజ్ మనీ గెలుచుకుంది.

 • Share this:
  కొన్ని చోట్ల జనాలు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. అగ్ర రాజ్యం అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. దీంతో అక్కడ.. వ్యాక్సినేషన్ వేయించుకన్నవారికి గిఫ్ట్‌లు అందజేస్తున్నారు. లక్కీ డ్రా పేరుతో జనాలు వ్యాక్సినేషన్ వైపు ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓహియో రాష్ట్రం.. కరోనా వ్యాక్సిన్ వేయించుకునే వారిని ఎంకరేజ్ చేసేందుకు లాటరీ కూడా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే గతేడాది ఇంజనీరింగ్ పూర్తిచేసిన 22 ఏళ్ల అబ్బిగైల్ బుగెన్స్కే (Abbigail Bugenske).. ఇటీవల ఉద్యోగం కోసం Cincinnati ప్రాంతానికి వచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆమె.. బంపర్ లాటరీలో తన పేరు నమోదు చేసుకుంది. ఇక, ఓహియో రాష్ట్రం ఇటీవల ఈ బంపర్ లాటరీ తొలి విజేతను ప్రకటించింది. అందులో అబ్బిగైల్ విజేతగా నిలిచింది. 1 మిలియన్ డాలర్ల(రూ. 7 కోట్ల) ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది.

  ఈ విషయాన్ని ఓహియో గవర్నర్ మైక్ డివిన్‌ ఆమెకు స్వయంగా ఫోన్ ద్వారా తెలియజేశారు. అయితే ఈ వార్త విన్న అబ్బిగైల్ తొలుత షాక్ తింది. అయితే మొదట్లో తనకు వచ్చింది ప్రాంక్ కాల్ అని అనుకున్నట్టు అబ్బిగైల్ తెలిపారు. ఆ తర్వాత ఫోన్‌కు వచ్చిన సందేశం చూసి తను లాటరీ గెలుచుకున్న విషయాన్ని నమ్మినట్టు చెప్పారు. ఇటీవల ఇంజనీరింగ్ పూర్తి చేసిన తాను.. మిలియనర్ కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

  ఆ తర్వాత ఆనందంలో Cleveland సమీపంలో ఉంటున్న తల్లిదండ్రుల ఇంటికి అబ్బిగైల్ బయలుదేరింది. ఇంటికి వెళ్లాక అబ్బిగైల్ ఏదో చెప్పడానికి ప్రయత్నించడం చూసిన ఆమె తల్లిదండ్రులు.. ఏదో తప్పు జరిగిందని భావించారు. అయితే కొద్దిసేపటికి.. తాను 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నట్టు చెప్పడంతో వారు కూడా ఆనందంలో మునిగిపోయారు. ఇక, ప్రస్తుతం అబ్బిగైల్ పేరు ఓహియో రాష్ట్రంలో మారుమోగుతోంది. అదృష్టం అంటే ఆమెదే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఇలాంటి ప్రైజ్ మనీలతో మరింత మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తారని అధికారులు భావిస్తున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: