Touring Couple: ప్రపంచ టూర్లు వేస్తున్న జంట... ఎక్కడికి వెళ్లినా నగ్నంగానే ఎంజాయ్

Nude Touring Couple: ఇలాంటి పర్యాటకులు కూడా ఉంటారా అనిపించే కథ వారిది. చుట్టూ ఎంత మంది ఉన్నా... వాళ్లు మాత్రం బట్టలు లేకుండానే ఉంటారు. అలాగే ఎంజాయ్ చేస్తారు.

news18-telugu
Updated: October 11, 2020, 9:51 AM IST
Touring Couple: ప్రపంచ టూర్లు వేస్తున్న జంట... ఎక్కడికి వెళ్లినా నగ్నంగానే ఎంజాయ్
Touring Couple: ప్రపంచ టూర్లు వేస్తున్న జంట... ఎక్కడికి వెళ్లినా నగ్నంగానే ఎంజాయ్ (credit - instagram)
  • Share this:
Nude Touring Couple: ప్రపంచాన్ని చుట్టేయాలనీ, రోజుకో కొత్త ప్రదేశాన్ని చూడాలని ఎవరికైనా ఉంటుంది. కానీ కొంత మందే అలాంటి కలను నిజం చేసుకుంటారు. అలాంటి ఓ జంట గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ల ప్రత్యేకత ఏంటంటే... నగ్నంగానే టూరిస్ట్ ప్లేసెస్‌లో ఉండాలన్నది వీరి కోరిక. ఈ వింత కోరిక తెలుసుకొని కొంత మంది నవ్వుతున్నారు, కొంత మంది నోరెళ్లబెడుతున్నారు... ఎవరేమనుకుంటే మాకేంటి... వెళ్లామా... నగ్నంగా చూశామా అన్నదే తమ పాలసీ అనుకుంటున్నారు వీళ్లు. చుట్టూ ఎంత మంది ఉన్నా... పిల్లలు, పెద్దలూ ఉన్నా... వీళ్లు మాత్రం ఒంటిపై చిన్న పీస్ కూడా డ్రెస్ లేకుండానే ఉంటారు. చివరకు ప్రజలే... వీళ్లను చూడకుండా... ఆ పక్క నుంచి అలా వెళ్లిపోతుంటారు.

Touring Couple: ప్రపంచ టూర్లు వేస్తున్న జంట... ఎక్కడికి వెళ్లినా నగ్నంగానే ఎంజాయ్ (credit - instagram)


బెల్జియంకి చెందిన నిక్, లిన్స్ కార్టే గురించే మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్లు తాము ఎక్కడికి వెళ్తే అక్కడ ఫొటోలు దిగుతారు. వాటిని సోషల్ మీడియా సైట్లలో షేర్ చేస్తారు. అఫ్ కోర్స్ వాటిలో చాలా వరకూ వైరల్ అయ్యాయనుకోండి. పార్కులు, బీచ్ లు, కొండలు, అడవులు ఇలా వీళ్ల ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. ఐతే... వీళ్ల టూర్ల కంటే... ఈ నగ్న ప్రదర్శన గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.

Touring Couple: ప్రపంచ టూర్లు వేస్తున్న జంట... ఎక్కడికి వెళ్లినా నగ్నంగానే ఎంజాయ్ (credit - instagram)


నిక్, లిన్స్ కార్టే... ఇద్దరి వయసూ 30 ఏళ్లే. 24 గంటలూ టూర్లు వెయ్యడమే పని. ఆమె తన ఫొటోలను ఫొటోవాన్స్ నాక్డ్ వాండెరింగ్స్ బ్లాగ్, ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేస్తుంది. తద్వారా వద్దంటే డబ్బు వచ్చి పడుతోంది. ఆ మనీతో వీళ్లు చక్కర్లు కొడుతున్నారు. అలా... ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలు పెడుతుంటే... వాటిని చూసేందుకు ఫాలోయర్ల సంఖ్య పెరుగుతుంటే... మనీ కూడా పెరుగుతోంది.

నిక్, లిన్స్ కార్టే...12 ఏళ్లుగా కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడూ బెల్జియం స్పా సెంటర్లకు వెళ్తున్నారు. నెలలో ఎక్కువ కాలం ఇతర దేశాల్లో తిరుగుతూ ఉంటారు. ఒక ప్రదేశం చూశాక... నెక్ట్స్ ఎక్కడికి వెళ్లాలి అన్నది ఆలోచించుకుంటారు. ఇద్దరూ మాట్లాడుకొని స్పాట్ ఎంచుకుంటారు. అక్కడికి విమానాలు, బస్సుల్లో ప్రయాణించి... చేరుకుంటారు. ఇక అక్కడ బట్టలు విప్పేస్తారు. అలా ఫొటోలు దిగుతారు. టూర్ వరకూ ఓకే... ఈ నగ్న కోరికలేంటని నెటిజన్లు వింతగా చూస్తున్నారు. అదే తమ ప్రత్యేకత అని గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్లు.
Published by: Krishna Kumar N
First published: October 11, 2020, 9:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading