• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • MEET THE MAN WITH 16 WIVES AND 151 CHILDREN WANT TO MARRY AGAIN IN ZIMBABWE SU

16 మంది భార్యలు, 151 మంది పిల్లలు.. మరో పెళ్లికి కూడా రెడీ.. రోజంతా అదే పనట..

16 మంది భార్యలు, 151 మంది పిల్లలు.. మరో పెళ్లికి కూడా రెడీ.. రోజంతా అదే పనట..

(Image-Twitter)

కొందరు రెండు పెళ్లిళ్లు, మూడు పెళిళ్లు చేసుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 16 పెళ్లిలు చేసుకున్నాడు.

  • Share this:
    కొందరు రెండు పెళ్లిళ్లు, మూడు పెళిళ్లు చేసుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 16 పెళ్లిలు చేసుకున్నాడు. 16 మంది భార్యలతో 151 మంది పిల్లల్ని కన్నాడు. ఆయన అతడు.. ఈ ప్రక్రియను ఆపేందుకు సిద్దంగా లేనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అతడు 17వ పెళ్లికి కూడా సిద్దమవుతుండటమే కారణం. వివరాలు.. జింబాబ్వేకు చెందిన 66 ఏళ్ల రిటైర్డ్ యుద్ధ సైనికుడైన మిషెక్ న్యాన్డోరో బహుభార్యత్వ విధానంతో వార్తల్లో నిలిచాడు. 100 పెళ్లిళ్లు చేసుకోవాలని.. 1000 మంది పిల్లల్ని కనాలనేది అతని కోరిక అని తెలిపాడని Daily Mail రిపోర్ట్ చేసింది. 1983లో అతడు ఈ బహుభార్యత్వ ప్రాజెక్టును ప్రారంభించినట్టు చెప్పాడు. తాను చనిపోయే వరకు ఈ ప్రాజెక్టును కొనసాగిస్తానని మిషెక్ తెలిపాడు.

    ‘కొత్తగా పెళ్లి చేసుకునే మహిళకు.. తన జీవితం గురించి మొత్తం చెబుతాను. వారికి అంగీకారమైతేనే పెళ్లి చేసుకుంటాను. ఇలా వారి సహకారంతోనే 16 పెళ్లిళ్లు చేసుకున్నారు. రోజంతా నా భార్యలని సంతృప్తి పరచడానికే కేటాయిస్తాను. నేను షెడ్యూల్ ప్రకారం బెడ్ రూమ్స్‌కు వెళ్తాను. అక్కడ నా భార్యను సంతృప్తి పరిచాక.. మరో రూమ్‌కు వెళ్తాను. అదే నా పని. నాకు ఇతర పనులేమి లేవు. బెడ్ రూమ్‌లో ఉన్న నా భార్యలను బట్టి నా ప్రవర్తన మారుతుంటుంది’అని మిషెక్ చెప్పాడు. అలాగే తనకు యువతులను పెళ్లి చేసుకోవాలని ఉందని కూడా వెల్లడించాడు. తన భార్యలందరూ ప్రస్తుతం వారు జీవిస్తున్న పరిస్థితులపై చాలా ఆనందంటా ఉన్నట్టు తెలిపాడు.







    Sex for Oxygen: మీ నాన్నకు ఆక్సిజన్ సిలిండర్ కావాలా.. అయితే నాతో పడుకో..

    ‘నా పిల్లలు నన్ను చెడగొట్టారు. నాకు వారు నిరంతరం గిఫ్ట్స్, డబ్బులు పంపిస్తుంటారు. ప్రతిరోజు నా భార్యలు నా కోసం వంటలు వండుతారు. కానీ నేను నాకు నచ్చిన ఆహారమే తింటాను. నాకు నచ్చనివాటిని తిరిగి పంపుతాను. వారికి ఈ రూల్స్ తెలుసు. ఫుడ్ తిరిగి పంపితే కోపగించుకోమని వారు నాకు ప్రామిస్ చేశారు. నేను ఏదైనా వారికి తిరిగి పంపితే అది వారు మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది’అంటూ మిషెక్ చెప్పుకొచ్చాడు. ఇక, ఈ వింటర్‌ సీజన్‌లో 17వ పెళ్లి చేసుకోవడానికి రెడీ కూడా అవుతున్నాడు మిషెక్.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు