Video : ఛాలెంజ్... ఈ మిర్చి తిని ఏడవకుండా ఉండగలరా?

Carolina Reaper : ప్రపంచంలో అత్యంత ఘాటు మిర్చిగా ఉన్న కరోలినా రీపర్ కంటే... ఎక్కువ కారంతో ఉండే మిర్చిని తయారుచేయడం సాధ్యమేనా?

news18-telugu
Updated: October 27, 2019, 11:20 AM IST
Video : ఛాలెంజ్... ఈ మిర్చి తిని ఏడవకుండా ఉండగలరా?
ఛాలెంజ్... ఈ మిర్చి తిని ఏడవకుండా ఉండగలరా? (credit - YT - WIRED)
  • Share this:
Carolina Reaper Pepper : పచ్చిమిర్చి అంటేనే కారంగా ఉంటుంది. ఇక చైనాకి చెందిన కాప్సికమ్ నుంచీ సృష్టించిన కరోలినా రీపెర్... జస్ట్ ఇలా కొరికితే చాలు... అలా కళ్లలోంచి నీళ్లు వచ్చేస్తాయి. దక్షిణ కరోలినాకి చెందిన రైతు ఎడ్ కర్రీ... ఈ పచ్చిమిర్చిని సృష్టించాడు. ఎరుపు రంగులో... ముడతలతో... చిన్న తోకతో ఉంటుంది. 2013లో ఈ పచ్చిమిర్చి ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే పచ్చి మిర్చిగా గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కింది. దీనికి ముందు ట్రినిడాడ్‌‌కి చెందిన బచ్ టి అనే పచ్చిమిర్చి అత్యంత హాట్ మిర్చిగా ఉండేది. ఇప్పుడు తాజా మేటరేంటంటే... కరోలినా రీపర్ కంటే ఎక్కువ కారం ఉండే మిర్చిని తయారుచేస్తానంటున్నారు ఎడ్ కర్రీ. ఆయనకు చెంందిన పుకెర్ బట్ పెప్పర్ కంపెనీ... ఇదే పనిలో ఉండి, పరిశోధనలు చేస్తోంది. మిర్చిలో జన్యుపరమైన మార్పులు, చేర్పులూ చేస్తోంది. అంటే త్వరలో మనం మరింత హాట్ మిర్చిని చూస్తామని అనుకోవచ్చు. ఇప్పుడున్న కరోలినా రీపరే... కన్నీళ్లు ఆగనివ్వట్లేదు... ఇక దీనికంటే కారంగా ఉన్నది వస్తే... ఇక కళ్లలో జల ప్రవాహాలే వస్తాయేమో.



 

Diwali 2019 : అంతటా దీపావళి సందడి... సెలబ్రిటీల విషెస్






ఇవి కూడా చదవండి :

Pics : 3000 ఏళ్ల నాటి మమ్మీలు... చెబుతున్న కొత్త కథేంటి?

Loading...
పునర్వవి దీపావళిని ఎవరితో జరుపుకుంటుందో తెలుసా...

Diwali 2019 : దీపావళికి దీపాలు ఎందుకు వెలిగిస్తారు... ఇదీ పండుగ ప్రాసస్థ్యం

Diwali 2019 : దీపావళి రోజున నువ్వుల నూనెని ఇలా వాడితే మేలు...

Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి
First published: October 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...