Home /News /international /

MEET KURDISH IRAQI FARMER AZAD MUHAMAD WHO BECOMES SOCIAL MEDIA STAR BY SHARING TIPS ON GROWING FRESH FRUIT AND VEGETABLES GH SRD

Ideal Farmer: ఎడారిలో కూడా లాభాల పంట.. సోషల్‌ మీడియాలో సాగుపై చిట్కాలు.. స్టార్‌గా మారిన రైతు..

Ideal Farmer ( PC : AFP)

Ideal Farmer ( PC : AFP)

Ideal Farmer: ఇరాక్ (Iraq) ఎడారి దేశం. ఎండలు తీవ్రంగా ఉంటాయి. దీంతో అక్కడ పంటల దిగుబడి అంతగా ఉండదు. అయితే ఆ దేశానికి చెందిన ఓ రైతు తాను పండించిన పంటలతో సోషల్ మీడియా స్టార్‌గా మారారు.

ఇరాక్ (Iraq) ఎడారి దేశం. ఎండలు తీవ్రంగా ఉంటాయి. దీంతో అక్కడ పంటల దిగుబడి అంతగా ఉండదు. అయితే ఆ దేశానికి చెందిన ఓ రైతు తాను పండించిన పంటలతో సోషల్ మీడియా స్టార్‌గా మారారు. ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతానికి చెందిన రైతు ఆజాద్ మహ్మద్‌. తీవ్రమైన ఎండలు ఉండే ఆ ప్రాంతంలో పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. అంతే కాకుండా పంటలను ఎలా పండించాలి, అందుకు సంబంధించిన చిట్కాలను పంచుకోవడం ద్వారా సోషల్ మీడియా స్టార్‌గా మారారు. 50 ఏళ్ల ఈ రైతుకు దాదాపు అర మిలియన్ల మంది ఫేస్‌బుక్ ఫాలోవర్లు ఉన్నారు. పండ్ల చెట్లను రక్షించడం, కీటకాలతో వ్యవహరించే తీరు, పండ్ల తోటలతో ఎక్కువ లాభాలు గడించే విధానం వంటి అంశాలపై వారానికోసారి వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

* సోషల్‌ మీడియాలో సాగు చిట్కాలు
ఆదర్శ రైతు ఆజాద్ మహ్మద్‌ మాట్లాడుతూ..‘అభివృద్ధి చెందిన దేశాల రైతులకు ప్రభుత్వ మద్దతు ఉంది. వారికి పంటకోత యంత్రాలను కూడా అందిస్తాయి. మా దేశంలో రైతులకు ప్రభుత్వం నుంచి మద్దతు కరవైంది. ఇక్కడి రైతులు తమ స్వేదంతో పంటలు పండిస్తున్నారు. అయితే ఆశించినంత స్థాయిలో ప్రయోజనం పొందలేకపోతున్నారు. మా దేశ భూమి సారవంతమైనది. బంగారం లాంటిది. ప్రభుత్వం దేశ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కోసం చమురు కంటే వ్యవసాయంపై ఎక్కువ దృష్టి సారించాలి.’ అని చెప్పుకొచ్చారు.



మహ్మద్‌ వివిధ పంటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. హలాబ్జా సమీపంలోని తన పొలంలో ద్రాక్ష తోటను సాగుచేస్తున్నారు. ఇంటి పైకప్పును తోటలుగా మార్చుకోవడం కూడా పర్యావరణాన్ని సంరక్షించడానికి ఓ మార్గమని అంటాడు ఈ ఆదర్శ రైతు.

ఒక వీడియోలో పంటలకు సంబంధించిన చిట్కాలను ఇలా తెలిపాడు. నేలను తేమగా ఉంచడానికి, మండుతున్న వేసవి వేడి నుంచి రక్షించడానికి, రైతులు తమ పంట మొక్కలను నాలుగు మీటర్లకు బదులుగా కేవలం రెండు మీటర్లు (ఆరు అడుగులు)దూరంలో నాటాలని సలహా ఇచ్చారు.

* విద్యార్థులకు ఆహ్వానం
టమోట పంట గురించి మాట్లాడుతున్న వీడియోలో..‘నీడలో ఉన్న పండ్లు తాజాగా ఉన్నాయి. పరిమాణం కూడా బాగా ఉంది. అయితే ఎండలో ఉన్న టమోటా మొక్కలు వాడిపోయాయి.’ అని తెలిపారు. ఇరాక్‌లోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే, ఉత్తర ప్రాంతమైన కుర్దిస్తాన్‌‌లో వర్షపాతం ఎక్కువగా నమోదు అవుతుంటుంది.

దీంతో ఇక్కడ కరవు ఛాయలు అంతగా కనిపించవు. ఆదర్శ రైతు ఆజాద్ మహ్మద్‌ ఇటీవల తన పొలంలో పంటలపై అవగాహన కల్పించడానికి ఒక చిన్న ఎడ్యుకేషన్ ప్రాంతాన్ని రూపొందించారు. యూనివర్సిటీల విద్యార్థులు తన పొలంలో సందర్శించాలని కోరాడు. తన కార్యక్రమాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయని ఆశిస్తున్నట్లు సదరు రైతు చెపుకొచ్చారు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Farmer, International news, Iraq, VIRAL NEWS

తదుపరి వార్తలు