• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • MEENA HARRIS WHITE HOUSE LAWYERS TELL MEENA HARRIS TO STOP USING AUNT KAMALA HARRIS TO BUILD HER BRAND SAYS REPORT NK

బ్రాండ్ కోసం కమలా హారిస్ పేరు వాడొద్దు... మీనా హారిస్‌కు వైట్‌హౌస్ లాయర్ల ఆదేశం?

బ్రాండ్ కోసం కమలా హారిస్ పేరు వాడొద్దు... మీనా హారిస్‌కు వైట్‌హౌస్ లాయర్ల ఆదేశం?

బ్రాండ్ కోసం కమలా హారిస్ పేరు వాడొద్దు... మీనా హారిస్‌కు వైట్‌హౌస్ లాయర్ల ఆదేశం? (image credit - twitter)

Meena Harris: అమెరికాలో ఇప్పుడు ఏం జరుగుతోంది? జో బిడెన్ పాలన ఎలా ఉంది? కమలా హారిస్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయా? మీనా హారిస్‌కు ఎందుకీ ఆదేశం ఇచ్చారు?

  • Share this:
    అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్... సోషల్ మీడియాను చూసుకునే మేనకోడలు మీనా హారిస్‌‌కి సహజంగానే తన మేనత్త కమలా హారిస్ వల్ల చాలా బ్రాండ్ పెరిగింది. ఇది వరకు మీనా హారిస్ ఎవరో ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు చాలా మందికి తెలుసు. చెప్పాలంటే అమెరికా రోజు వారీ వార్తల్లో ఇప్పుడు మీనా హారిస్ కూడా ఉంటున్నారు. దీనిపై వైట్ హౌస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇదివరకు పర్లేదు గానీ... ఇప్పుడు కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు కాబట్టి... ఇకపై ఆమె పేరును వాడుకుంటూ మీనా హారిస్ తన బ్రాండ్ పెంచుకోవాలని చూస్తే కుదరదు అంటున్నాయి. దీనిపై చట్టపరమైన రూల్స్ అమలు చేయాలని వైట్ హౌస్ వర్గాలు కోరినట్లుగా ఓ రిపోర్ట్ చెబుతోంది.

    "కొన్ని కొన్ని చేయడానికి వీల్లేదు" అని వైట్ హౌస్ అధికారి ఒకరు... 36 ఏళ్ల మీనా హారిస్‌కు చెప్పినట్లుగా... లాస్ ఏంజిల్స్ టైమ్స్ చెబుతోంది. "మీరు మీ పద్ధతి, వ్యవహార శైలిని మార్చుకోవాలి" అని అధికారి చెప్పినట్లు తెలిసింది.

    మీనా హారిస్... స్వయంగా ఓ లాయర్... వ్యాపారవేత్త కూడా. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఆమె పెట్టే పోస్టుల్లో కొన్ని వ్యక్తిగతమైనవి, కొన్ని రాజకీయపరమైనవి ఉంటున్నాయి. ఆమె పిల్లల పుస్తకాలు కూడా రాస్తారు. ఓ పుస్తకానికి ఆమె "కమలా అండ్ మాయాస్ బిగ్ ఐడియా" ("Kamala and Maya’s Big Idea") అని పేరు పెట్టారు. మహిళల చారిటబుల్ క్లాతింగ్ బ్రాండ్ ఫెనోమెనల్ ("Phenomenal.") కూడా ఆమెదే. తాజాగా మీనా హారిస్... ఏంబిషియస్ గర్ల్ ("Ambitious Girl") పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. మర్నాడు ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం చేయబోతుంటే... ఆ ముందు రోజు దాన్ని విడుదల చేయడం అభ్యంతరకరంగా మారింది.

    ఇది కూడా చదవండి: Money fortune: సంపన్నులు కావాలంటే నిద్ర లేచాక ఇలా చెయ్యండి

    ఎన్నికల తర్వాత... కమలా హారిస్ పేరుతో ఏ ఉత్పత్తులూ తయారుచేయకూడదని వైట్ హౌస్ లాయర్లు మీనా హారిస్‌కు చెప్పినట్లు తెలిసింది. ఐతే... కమలా అండ్ మాయాస్ బిగ్ ఐడియా పుస్తకంలో కమలా పేరు వాడటంపై వైట్ హౌస్ వర్గాలు అభ్యంతరం చెబుతున్నాయి. అలాగే ఓ షర్టుపై మీనా హారిస్... వైస్ ప్రెసిడెంట్ ఆంటీ అని రాయడం కూడా సమస్యగా మారిందంటున్నారు. లాయర్లు చెప్పినా మీనా హారిస్ తీరు మార్చుకోవట్లేదనే ప్రచారం జరుగుతోంది. జో బిడెన్‌కి సంబంధించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రైవేట్ విమానంలో వెళ్లిన మీనా హారిస్... ఆ విషయాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంపై అభ్యంతరం చెబుతున్నారు. ప్రస్తుతం మీనా హారిస్ ఆన్‌లైన్ స్టోర్‌లోని స్వెట్ షర్టులపై ఐయామ్ స్పీకింగ్ అనే పదం ఉంది... ఈ పదాన్ని కమలా హారిస్... వాడారు. దీన్ని వాడటంపై కూడా వైట్ హౌస్ లాయర్లు అభ్యంతరం చెబుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు