హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Smile Policy : స్మైల్ పాలసీ..ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు నవ్వుతూ పనిచేయాలి

Smile Policy : స్మైల్ పాలసీ..ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు నవ్వుతూ పనిచేయాలి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Smile Policy:ఈ పాలసీ కింద.. ప్రభుత్వ ఉద్యోగులు నవ్వుతూ ఉండాలని ఆదేశించారు. ఎవరైనా పాటించకపోతే దానికి శిక్ష కూడా పడుతుంది. . ఈ రూల్ వినడానికి కాస్త వింతగా ఉన్నా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది.

Smile Policy : ప్రపంచంలో పలు దేశాల్లోని కొన్ని చట్టాలు లేదా పాలసీలు మనకు ఆశ్చర్యం కలిగిచడమే కాకుండా కొన్ని వింతగా,మరికొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. తాజాగా అలాంటి పాలసీనే ఫిలిప్పీన్స్(Philippines) దేశంలో ప్రవేశపెట్టారు. ఆ పాలసీ పేరే "స్మైల్ పాలసీ(Smile Policy)". ఫిలిప్పీన్స్‌లోని ఒక మేయర్ ఈ పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ కింద.. ప్రభుత్వ ఉద్యోగులు నవ్వుతూ ఉండాలని ఆదేశించారు. ఎవరైనా పాటించకపోతే దానికి శిక్ష కూడా పడుతుంది. . ఈ రూల్ వినడానికి కాస్త వింతగా ఉన్నా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది.

ఫిలిప్పీన్స్ దేశంలోని లుజోన్ ద్వీపంలోని క్యూజోన్ ప్రావిన్స్‌లోని మూలానే టౌన్‌ లో ఇటీవల అరిస్టాటిల్ అగురే అనే వ్యక్తి మేయర్ గా బాధ్యతలు చేపట్టారు. కోకోనట్ పెంపకం దారులు,స్థానిక మత్యకారులు సహా పలువురు తాము ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి సంబంధిత సమాచారం అడిగినప్పుడు లేదా ట్యాక్స్ కట్టడానికి వెళ్లిన సమయంలో ప్రభుత్వ ఆఫీసుల్లోని ఉద్యోగులు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారంటూ మేయర్ అరిస్టాటిట్ కు ఫిర్యాదు చేశారు. . ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వైఖరిలో మార్పు తీసుకు రావాలనుకున్నారు మేయర్. ఈ నేపథ్యంలో మేయర్ బాగా ఆలోచించి స్మైల్ పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం..ప్రజలు తమ పని మీద ప్రభుత్వ కార్యాలయాలకి వచ్చినప్పుడు వారిని ప్రభుత్వ ఉద్యోగులు మంచిగా ఆదరించాలి,నవ్వుతూనే వారితో మాట్లాడాలి.

Aloe Vera Oil : చర్మం,జుట్టుకి కలబంద ఆయిల్ తో బోలెడు ప్రయోజనాలు..దీన్ని ఎలా ఉపయోగించాలో చూడండి

ఈ పాలసీ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మేయర్ వివరిస్తూ...ప్రజలకు సేవలు అందిస్తూనే శాంతియుతమైన, సౌకర్యవంతమైన వాతావరణం నెలకొల్పాలి అని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ప్రభుత్వ ఉద్యోగులందరూ పాటించాలని, ఎవరైనా పాటించకపోతే వారికి శిక్ష లేదా జరిమానా కూడా విధించబడుతుందని మేయర్ తెలిపారు. స్మైల్ పాలసీ ప్రకారం, ఉద్యోగులు ఈ ఆర్డర్‌ను పాటించడానికి నిరాకరిస్తే, వారి 6 నెలల జీతం తీసివేయబడుతుందని లేదా వారిని పని నుండి సస్పెండ్ చేయవచ్చని అతను స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మేయర్‌గా మారిన అరిస్టాటిల్ ఇంతకు ముందు ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేశారు.

First published:

Tags: Employees, Philippine

ఉత్తమ కథలు