హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Hafiz Saeed : పాపం పండింది..ముంబై పేలుళ్ల సూత్రధారికి హఫీజ్ కు 33 ఏళ్ల జైలు శిక్ష

Hafiz Saeed : పాపం పండింది..ముంబై పేలుళ్ల సూత్రధారికి హఫీజ్ కు 33 ఏళ్ల జైలు శిక్ష

LeT Chief Hafiz Saeed sentenced  : ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన సూత్రధారి ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని కేంద్రం పలుమార్లు కోరినప్పటికీ పాక్‌ తిరస్కరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.

Hafiz Saeed sentence : 2008 ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తాయిబా ఉగ్రసంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ కు 33 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం అందిస్తున్నాడన్న ఆరోపణలపై 2019లో హఫీజ్ పై..1997 నాటి ఉగ్రవాద నిరోధక చట్టం (ATA)లోని వివిధ సెక్షన్ల కింద పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజమ్ డిపార్ట్ మెంట్(CTD)నమోదుచేసిన రెండు కేసుల్లో అతడిని దోషి గా తేల్చిన యాంటీ-టెర్రరిజం కోర్టు శుక్రవారం హఫీజ్ కు 33ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఒక కేసులో 15.5 సంవత్సరాలు, మరో కేసులో 16.5 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ బుట్టార్ తీర్పు చెప్పారు. జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల 40వేలు జరిమానా విధించిన కోర్టు.. హఫీజ్ కుచెందిన ఆస్తులు స్తంభింపజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. హఫీజ్‌ సయీద్‌ నిర్మించిన మసీదు, మదర్సాను పాక్‌ అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు.

ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కేసుల్లో 70 ఏళ్ల హఫీజ్ సయీద్‌ కు పలు సార్లు జైలు శిక్షలు పడ్డాయి. హఫీజ్‌కు ఇప్పటికే ఉన్న జైలు శిక్షను కలుపుకొంటే.. మొత్తం 68ఏళ్ల జైలు శిక్షను అతడు అనుభవించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు 2020లో టెర్రర్ ఫండింగ్ కేసులో యాంటీ టెర్రర్ కోర్టు 15 ఏళ్లు జైలు శిక్ష విధించింది. హఫీజ్ సయీద్‌ ప్రస్తుతం లాహోర్‌ లోని కోట్‌ లఖ్‌ పట్‌ జైలులో ఉన్నాడని సమాచారం.

ALSO READ Intresting : భార్యకు కడుపు చేయడానికి..జీవిత ఖైదీ అయిన భర్తకు 15 రోజుల పెరోల్

మరోవైపు, ముంబై ఉగ్రదాడుల్లో ప్రధాన సూత్రధారి ఆరోపణలు ఎదుర్కొంటున్న హఫీజ్‌ సయీద్‌ను అప్పగించాలని కేంద్రం పలుమార్లు కోరినప్పటికీ పాక్‌ తిరస్కరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. 2008 నవంబర్‌ 26న ముంబైలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు సముద్ర మార్గంలో బోటు ద్వారా ముంబైలోకి చొరబడ్డారు. ముంబై రైల్వే స్టేషన్‌, తాజ్ హోటల్‌తోపాటు పలు చోట్ల సాధారణ ప్రజలు, పోలీసులపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. నవంబర్‌ 29 వరకు జరిగిన ఈ దాడుల్లో 175 మంది మరణించారు. 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడులకు పాల్పడ్డ వారిలో కడైన కసబ్‌ ను ముంబై పోలీసులు సజీవంగా పట్టుకున్నారు. కోర్టు ఉరి శిక్ష విధించడంతో 2012 నవంబర్‌ 21న పూణేలోని ఎరవాడ జైలులో కసబ్ ని ఉరి తీశారు.

First published:

Tags: Blasts, Pakistan, Terrorists

ఉత్తమ కథలు