Maryam Nawaz: బాత్‌రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టారు.. మరియమ్ నవాజ్ సంచలన ఆరోపణలు

పాకిస్తాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియమ్ నవాజ్(Maryam Nawaz Sharif) సంచలన ఆరోపణలు చేశారు.

news18-telugu
Updated: November 13, 2020, 1:08 PM IST
Maryam Nawaz: బాత్‌రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టారు.. మరియమ్ నవాజ్ సంచలన ఆరోపణలు
మరియమ్ నవాజ్(ఫైల్ ఫొటో)
  • Share this:
పాకిస్తాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్(పీఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షురాలు మరియమ్ నవాజ్(Maryam Nawaz Sharif) సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడు తన గదితో పాటు బాత్రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టారని ఆరోపించారు. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. గతేడాది చౌదరి షుగర్ మిల్స్‌ కేసులో అరెస్ట్ అయినా మరియమ్ నవాజ్.. జైలులో తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించారు. "నేను రెండు సార్లు జైలుకు వెళ్లాను. జైలులో మహిళలతో ఎలా వ్యవహరిస్తారనే దాని గురించి నేను మాట్లాడం మొదలుపెడితే.. ఇక్కడి ప్రభుత్వం, అధికారులు ముఖం కూడా చూపించలేదు. పాకిస్తాన్‌లోనైనా, మరెక్కడైనా గానీ స్త్రీలు బలహీనంగా లేరు. నన్ను వేధింపులకు గురిచేసినప్పుడు నేను ఏడవడానికి ఇష్టపడలేదు. వేధింపులకు కుంగిపోకుండా ఆ సత్యాన్ని ప్రపంచానికి తెలియాజేయాలని అనుకున్నాను " అని మరియమ్ నవాజ్ స్పష్టం చేశారు.

అలాగే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై కూడా మరియమ్ నవాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు నా గదిలోకి బలవంతంగా దూరి.. నిజం మాట్లాడినందుకు నా తండ్రి ముందే అరెస్ట్ చేస్తే.. జైలు గదుల్లో, బాత్‌రూమ్‌లో కెమెరాలు పెడితే ప్రైవేటుగా దాడి చేయవచ్చు. అలాంటప్పుడు పాకిస్తాన్‌లో ఏ మహిళకు రక్షణ ఉండదు" అని అన్నారు.

ఇక, రాజ్యంగ వ్యవస్థల పట్ల తమకు వ్యతిరేకత లేదని.. రహస్య సంప్రదింపులు జరపబోమని మరియమ్ నవాజ్ చెప్పారు. రాజ్యాంగ నిబంధనల మేరకు సైన్యంతో చర్చించేందుకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. పాకిస్థాన్ డెమొక్రాటిక్ మువ్‌మెంట్ (PDM) వేదికపై చర్చలకు సిద్ధమేనని తెలిపారు.
Published by: Sumanth Kanukula
First published: November 13, 2020, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading