హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Marwari Horses: బంగ్లాదేశ్ అధ్యక్షుడి కోసం భారత గుర్రాలు.. ఇదే తొలిసారి.. ప్రత్యేకతలు ఇవే

Marwari Horses: బంగ్లాదేశ్ అధ్యక్షుడి కోసం భారత గుర్రాలు.. ఇదే తొలిసారి.. ప్రత్యేకతలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Marvari horse: భారతీయ మార్వాడీ గుర్రాలు తొలిసారి బంగ్లాదేశ్‌కు ఎగుమతి అయ్యాయి. ఆ దేశ అధ్యక్షుడి గుర్రపు బండిని లాగేందుకు వీటిని వినియోగిస్తారట.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Marwari Horses:  గతంలో భారత రాజవంశాల్లో గుర్రాలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకత చాటుకున్న అనేక జాతుల గుర్రాలు మన దగ్గర అశ్వ దళాల్లో కనిపించేవి. అయితే ఇప్పుడు రాజవంశాలు లేకపోయినా, గుర్రాల సంక్షేమం కోసం కొన్ని సంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో మన భారతీయ మార్వాడీ గుర్రాలు తొలిసారి బంగ్లాదేశ్‌కు ఎగుమతి అయ్యాయి. ఆ దేశ అధ్యక్షుడి గుర్రపు బండిని లాగేందుకు వీటిని వినియోగిస్తారట. రాజస్థాన్‌ (Rajasthan)లోని జోధ్‌పూర్ నుంచి బంగ్లాదేశ్‌ (Bangladesh)కు ఆరు మార్వాడీ గుర్రాలను (Marwadi horse) ఎగుమతి చేశామని ఆల్ ఇండియా మార్వాడీ హార్స్ సొసైటీ అధికారి ఒకరు తెలిపారు. ఎడారి ప్రాంతంలో పుట్టిన ఈ దేశీ జాతి గుర్రాలని ఎగుమతి చేయడం ఇదే తొలిసారని చెప్పారు.

తాజాగా ఎగుమతి చేసిన ఆరు గుర్రాలు సెప్టెంబర్ 29న బంగ్లాదేశ్‌ చేరుకున్నాయని ‘ఆల్ ఇండియా మార్వాడీ హార్స్ సొసైటీ, మార్వారీ హార్స్ స్టడ్ బుక్ రిజిస్ట్రేషన్ సొసైటీ (MHSRS)’ సెక్రటరీ జంగ్‌జీత్ సింగ్ నథావత్ తెలిపారు. వీటిని బంగ్లా ప్రెసిడెంట్ గుర్రపు బండిని లాగేందుకు ఆ దేశ పోలీసులు ఆర్డర్ చేసినట్లు తెలిపారు. మార్వాడీ గుర్రాలను ఎగుమతి చేయడానికి తాము అనుమతులు పొందామని, ఎదుటివారి అవసరాన్ని బట్టి ఎగుమతులను నిర్ణయిస్తామని జంగ్‌జీత్ చెప్పారు.

Village for Sale : అమ్మకానికి గ్రామం.. విలువ రూ.2 కోట్లు.. కొనేస్తారా?

* ప్రత్యేక గుర్తింపు

గుర్రాల జాతుల్లో మార్వాడీ గుర్రాలది అత్యుత్తమ జాతి. ఇవి చాలా అందంగా, బలంగా ఉంటాయి. ఎక్కువ కాలం బతికేవిగా ప్రసిద్ధి చెందాయి. దశాబ్ద కాలంగా జోధ్‌పూర్‌లోని MHSRS మార్వాడీ గుర్రపు జాతిని పరిరక్షించడంతో పాటు విదేశీ హార్స్‌ లవర్స్‌, హార్స్‌ రైడర్స్‌ కోసం ఎగుమతులకు ప్రయత్నిస్తోంది. ఈ గుర్రాలు జోధ్‌పూర్‌ రాజ్‌పుత్‌ రాజకుటుంబాలకు సంబంధించిన ఉమైద్ భవన్ ప్యాలెస్ పరిధిలోని బాల్ సమంద్ లేక్ ప్యాలెస్‌ మార్వార్ స్టడ్‌కు చెందినవి. ఇవి MHSRSలో ‘మార్వాడీ గుర్రాలు’గా నమోదయ్యాయి. వీటి ఎగుమతి కోసం MHSRS, కేంద్ర యానిమల్‌ హస్బెండరీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ పొందింది. గుర్రాలను విదేశాలకు ఎగుమతి చేయడానికి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నుంచి లైసెన్సు కూడా సంపాదించింది.

బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ గుర్రాలను అధ్యక్షుడి జట్కా కోసం దిగుమతి చేసుకోవడం గర్వకారణం అంటున్నారు జంగ్‌జీత్. అమెరికా, ఐరోపా, అరేబియా దేశాల నుంచి మార్వాడీ గుర్రాలకు ఎక్కువ డిమాండ్‌ ఉందన్నారు. బ్రీడ్ హిస్టరీని మ్యాపింగ్ చేయడం వల్ల మార్వాడీ జాతికి డిమాండ్ పెరిగిందని, వీటి ఎగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు సొసైటీ ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.

సొసైటీ జాయింట్ సెక్రటరీ గజేంద్రపాల్ సింగ్ పోసానా మాట్లాడుతూ.. ఈ జాతిని ఎగుమతి చేసేందుకు మంత్రిత్వ శాఖను ఒప్పించేందుకు 12-13 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి 40-50 గుర్రాలకు డిమాండ్ ఉందని, అయితే అనుమతుల్లో జాప్యం వల్ల తాము ఆరింటినే పంపించగలిగామని చెప్పారు. మరో 17 గుర్రాలను వారు అరేబియా నుంచి తెప్పించుకున్నారని వివరించారు.

:

First published:

Tags: Bangladesh, Horse, International news

ఉత్తమ కథలు