అంగారకునిపై కీటకాలు...సాక్ష్యాలివిగో అంటున్న నాసా...

మార్స్‌ రోవర్స్‌ వెలువరించిన చాయా చిత్రాలను ఇందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు. కీటకాలు, తేనె టీగలు, సరీసృపాలు, శిలాజాల రూపాలలో ఉన్న జీవులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

news18-telugu
Updated: November 27, 2019, 11:05 PM IST
అంగారకునిపై కీటకాలు...సాక్ష్యాలివిగో అంటున్న నాసా...
మార్స్ ఊహాచిత్రం (Image : NASA)
  • Share this:
అంగారకునిపై కీటకాల లాంటి జీవులు ఉన్నాయనడానికి సాక్ష్యం ఉందని అమెరికాలోని ఓహియో యూనివర్సిటి పరిశోధకుడు, ప్రొఫెసర్‌ విలియం విశ్వసిస్తున్నాడు. అంగారకునిపై ప్రాణమున్న జీవులు ఉన్నాయా, లేదా అనే విషయమై నిర్ధారణకు వచ్చేందుకు ఒక ప్రక్క శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్న సమయంలో మరో వైపు విలియం జీవులున్నాయని విశ్వసిస్తూ, వివిధ మార్స్‌ రోవర్స్‌ వెలువరించిన చాయా చిత్రాలను ఇందుకు సాక్ష్యంగా చూపిస్తున్నారు. కీటకాలు, తేనె టీగలు, సరీసృపాలు, శిలాజాల రూపాలలో ఉన్న జీవులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. వివిధ మార్స్‌ రోవర్లు పంపిన ఛాయా చిత్రాలు అక్కడ శిలాజాలు, జీవులు ఉన్నట్లు చూపుతున్నాయన్నారు.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>