సోదరుడికి, సోదరికి పెళ్లి జరిపించారు.. అసలు ఇది ఎలా సాధ్యం.. అవును సాధ్యమైంది.. ఏం జరిగిందో చదవండి..

ప్రతీకాత్మక చిత్రం

కొన్ని సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన కుమార్తెకు ప్రస్తుతం వారి వద్ద పెరుగుతున్న తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఓ దంపతులు. అంటే సోదరి, సోదరుడుకు పెళ్లి జరిపించారు. ఈ అనుకోని ఘటన చైనాలో చోటుచేసుకుంది. సినిమాను తలపించే ఈ కథ ఏంటో తెలుసుకోండి..

 • Share this:
  కొన్ని సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన కుమార్తెకు ప్రస్తుతం వారి వద్ద పెరుగుతున్న తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఓ దంపతులు. అంటే సోదరి, సోదరుడుకు పెళ్లి చేశారు. ఈ అనుకోని ఘటన చైనాలో చోటుచేసుకుంది. సినిమాను తలపించే ఈ కథ ఏంటో తెలుసుకోండి.. దంపతులకు ఇద్దరు కవలలు. అందులో చిన్నతనంలో ఉన్నప్పుడే కవలలో ఒకరు తప్పిపోతారు. ఎవరో దుండగులు దొంగిలించి పిల్లలు లేని వారికి అమ్ముతారు. అలాగే వారు పెరిగి పెద్ద అయిన తర్వాత కన్న తల్లిదండ్రులకు కంటపడి పుట్టమచ్చ లేక ఎదో ఒక ఆనవాలు చూసి నా కుమారుడే అని గతం చెప్పి దగ్గరకు తీసుకొని ఒకటవుతారు. ఇలాంటి కథలు మనం సినిమాలో చాలా చూస్తూ ఉంటాం. కానీ నిజ జీవితంలో కూడా అలాంటి ఘటనే జరిగింది. కానీ కవలలు కాకుండా సోదరి, సోదరులు చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు. ఇక్కడా ట్విస్ట్ ఏంటంటే వారిద్దరికీ పెళ్లి కూడా నిశ్చయించారు. అసలేం జరిగింది.. సోదరుడు, సోదరి పెళ్లి ఎలా చేసకుంటారు. సనిమా యాంగిల్ లో జరిగిన నిజమైన కథను ఇప్పడు తెలుసుకుందాం..

  చైనాలో జియాంగ్జు రాష్ట్రంలోని సుజౌ ప్రాంతంలో నివాసం ఉంటున్న దంపతులు తన కుమారుడికి సంబంధం చూశారు. వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి వేడుకలోనే తన కాబోయే కోడలి వద్దకు వెళ్లిన అత్తకి ఆమె చేతిపై ఉన్న పుట్టమచ్చ చూసి ఆశ్చర్యానికి లోనయింది. ఆ దంపతులు చిన్నతనంలో తన కుమార్తెను పోగొట్టుకున్నారు. ఆమె తన కోడలు అని మనసులో అనుకుంది. సందేహం వచ్చిన వెంటనే ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అడిగింది. మొదట వారు చెప్పడానికి సందేహించినా నిజం చెప్పారు. 20 సంవత్సరాల క్రితం మాకు రోడ్డు పక్కన దొరికిందని చెప్పారు. అప్పటినుంచి దత్తత తీసుకొని పెంచామన్నారు. అయితే నిజం తెలసుకున్న తన కూతురు అత్త అనుకున్న తమ అమ్మ దగ్గరకు పోయి సంతోషంతో ఆలింగనం చేసుకుంది. ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ పెళ్లి చేసుకోబోయే కుమారుడు తనకు సోదరుడు అవుతాడు కదా.. పెళ్లి ఎలా జరుగుతుందని మదనపడింది.

  కానీ వారికి పెళ్లి జరిగింది అదెలాగంటే.. తన వద్ద ఉన్న కుమారుడు కూడా దత్తత తీసుకున్నట్లు తెలిపారు. 20 సంవత్సరాల క్రితం తమ కుమార్తె దూరమైన తర్వాత ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికిన ఆ తల్లి.. ఆ తర్వాత ఓ బాలుడుని దత్తత తీసుకుని పెంచుకున్నారట. దీంతో ఆ వధూవరుల పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోయింది.
  Published by:Veera Babu
  First published: