19 అంతస్తుల భవనంలో మంటలు..ప్రాణాల కోసం దూకేసిన జనాలు

అగ్నిప్రమాదంతో బనానీ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు అంతకంతకూ వ్యాపిస్తుండడంతో భవనంలో చిక్కుకున్న ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు.

news18-telugu
Updated: March 28, 2019, 4:37 PM IST
19 అంతస్తుల భవనంలో మంటలు..ప్రాణాల కోసం దూకేసిన జనాలు
ఢాకాలో అగ్నిప్రమాదం (Image:SaraBangla)
news18-telugu
Updated: March 28, 2019, 4:37 PM IST
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బనానీ ప్రాంతంలోని FR టవర్‌లో మంటలు చెలరేగాయి. 19 అంతస్తుల భవనంలో వాణిజ్య సముదాయాలే ఎక్కువగా ఉన్నాయి. ఓ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి క్రమంగా పై అంతస్తులకు వ్యాపించాయి. వందలాది మంది జనాలు ఆ భవనంలో చిక్కుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మంటల్లో చిక్కుకొని ఇప్పటి వరకు నలుగురు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఇక భవనం చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఆర్మీ, అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి.

ఢాకా అగ్నిప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు వ్యక్తులు పైపులను పాకుతూ కిందకు దిగుతున్నారు. ఆ క్రమంలో పలువురు పట్టుతప్పి కిందపడిపోయారు. ఇక మంటల్లో కాలుతున్న గదుల నుంచి శకలాలతో పాటు పలు డెడ్‌బాడీలు సైతం కిందపడినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. పలు వస్తువులు భవనం పై నుంచి కిందపడుతున్న దృశ్యాలను స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

అగ్నిప్రమాదంతో బనానీ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు అంతకంతకూ వ్యాపిస్తుండడంతో భవనంలో చిక్కుకున్న ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. కిటికీల అద్దాలను పగులగొట్టి కేకలు వేస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఎక్కువ మంది భవనం పైఅంతస్తుకు చేరుకున్నారు. వారిని రక్షించేందుకు ప్రత్యేక హెలికాప్టర్లను పంపించారు అధికారులు. పై అంతస్తు నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి పలువురిని కాపాడారు. ప్రస్తుతం FR టవర్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...