భారత భూభాగాలు నేపాల్‌వే అంటూ మద్దతిచ్చిన మనీషా కొయిరాలా...

మనీషా కొయిరాలా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమెను నేపాల్ వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: May 20, 2020, 10:37 PM IST
భారత భూభాగాలు నేపాల్‌వే అంటూ మద్దతిచ్చిన మనీషా కొయిరాలా...
మనీషా కొయిరాలా (File)
  • Share this:
నేపాల్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి ఒకప్పటి హీరోయిన్ మనీషా కొయిరాలా మద్దతు పలికింది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మూడు పట్టణాలు లిపులేక్, కాలాపాని, లింపియాధురా పట్టణాలను తమవే అంటూ నేపాల్ ఓ కొత్త మ్యాప్‌ను రిలీజ్ చేసింది. మే 18వ తేదీన ఈ మేరకు నేపాల్ కేబినెట్ ఈ కొత్త మ్యాప్‌కు ఆమోదం తెలిపింది. ఆ నిర్ణయాన్ని బాలీవుడ్ హీరోయిన్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి తెలుగు సినిమాల్లో నటించిన మనీషా కొయిరాలా సమర్థించింది. ఆ మూడు పట్టణాలను తమదివిగా పేర్కొంటూ నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రదీప్ గ్యావాలీ చేసిన ట్వీట్‌ను మనీషా కొయిరాలా రీ ట్వీట్ చేసింది. అందులో ‘మన చిన్న దేశం స్వాభిమానాన్ని కాపాడినందుకు థాంక్స్. దీనిపై మూడు గొప్ప దేశాల మధ్య శాంతియుతమైన, గౌరవప్రదంగా చర్చలు జరుగుతాయని ఎదురుచూస్తున్నా.’ అని మనీషా కొయిరాలా ట్వీట్ చేసింది. మనీషా కొయిరాలా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమెను నేపాల్ వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించారు.

 
నేపాల్ కొత్త మ్యాప్‌లో ఏడు ప్రావిన్స్‌లు, 77 జిల్లాలు, 753 స్థానిక పరిపాలన డివిజన్లు పొందుపరిచారు. అందులో లింపియాధురా, కాలాపాని, లిపు లేక్ కూడా ఉన్నాయి. లిపు లేక్ పాస్ అనేది కాలాపానిలో ఓ భాగం. 2019 నవంబర్‌లో భారత్ విడుదల చేసిన అధికారిక మ్యాప్‌లో దాన్ని భారత భూభాగంగా చూపింది. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాలాపాని అనేది ఉత్తరాఖండ్‌లోని పితోర్ గఢ్ జిల్లాలో భాగమని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు నేపాల్ మాత్రం కాలాపాని అనేది ధార్చులా జిల్లాలో భాగం అని పేర్కొంది.
First published: May 20, 2020, 10:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading